Monday, May 20, 2024
- Advertisement -

హైద‌రాబాద్ జంట‌పేళుల్ల‌కేసులో 11 ఏళ్ల త‌ర్వాత‌ తుది తీర్పును వెలువ‌రించిన కోర్టు..

- Advertisement -

గోకుల్‌చాట్, లుంబిని పార్క్ పేలుళ్లపై విచారణ పూర్తైంది. గోకుల్ చాట్, లుంబిని పార్క్ కేసులకు సంబంధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది. మరో ఇద్దరి నిందితులపై ఉన్న కేసును కొట్టి వేసింది. వారిపై ఆధారాలు లేవని తేల్చింది. ఏ1, ఏ2లు అక్బర్ ఇస్మాయిల్ చౌద‌రి , అనీఖ్‌ సయిద్‌లను దోషులుగా తేల్చారు. వచ్చే సోమవారం వారికి శిక్షను ఖరారు చేయనుంది.

2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా ఎన్ఐఏ నిర్దారించింది.ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ 1125 పేజీల చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

Court Verdict on Hyderabad Twin Blasts Case - Sakshi

ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్ పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్ పెద్ద ఇంకా పోలీసులకు చిక్కలేదు.

11 ఏళ్లపాటు సుధీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణ తుది వాదనలు ఈ ఏడాది ఆగస్టు 7న ముగిశాయి. ఆగస్టు 27న తుది తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. కానీ న్యాయమూర్తి తీర్పును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు. నేడు ఇద్దరిని దోషులుగా తేల్చుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శిక్షను సోమవారానికి వాయిదా వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -