Thursday, May 2, 2024
- Advertisement -

బెంగుళూరులో పుట్టి త‌మిళ‌నాడులో పెరిగిన మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ‌

- Advertisement -

ఆ మ‌ధ్య దేవీ శ్రీ ప్ర‌సాద్.. అనే ఓ విచిత్రమైన క‌థాంశంతో వ‌చ్చిన చిత్రంలో న‌టించిన‌.. హాట్ భామ పూజా రామ‌చంద్ర‌న్ గుర్తుంది క‌దా. శ‌వంతో సెక్స్ చేసే స‌న్నివేశం ప్ర‌ధాన అంశంగా తెర‌కెక్కిన చిత్రంలో శ‌వంగా న‌టించిన భామ‌. ఇప్పుడు ఈ హాటు భామ నీ.. నా.. టీవీలో త‌న అందాల‌ను ఆర‌బోసేందుకు సిద్ధ‌మైంది. తెలుగు బిగ్‌బాస్‌లోనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవ‌రొస్తారా.. అన్న ఎదురుచూపులు ఫ‌లించాయి. స్వామిరారా, దేవి శ్రీ ప్ర‌సాద్ లాంటి చిత్రాల తార పూజా రామంచ‌ద్ర‌న్ వైల్డ్ కార్డ్ ఎంట్రీద్వారా బిగ్‌బాస్‌లోనికి ప్ర‌వేశించ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రీ పూజా.. తెలుగ‌మ్మాయేనా.. లేక ప‌ర‌భాషా న‌టీమ‌ణా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

పూజా రామ‌చంద్ర‌న్ తెలుగ‌మ్మాయి కాదు. పూజా తండ్రి ఆర్మీ అధికారి. త‌మిళ‌నాడులో నివ‌సించే మ‌ళ‌యాళీ కుటుంబానికి చెందిన పూజ‌.. పుట్ట‌డం, పెర‌గ‌డం అంతా బెంగ‌ళూరులోనే. పూజా విజువ‌ల్ డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత‌.. మిస్ కోయంబ‌త్తూర్ 2004 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ కేర‌ళ 2005 ర‌న్న‌ర‌ప్‌గానూ నిలిచింది. ఆ త‌ర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా అవకాశం వ‌చ్చింది. అంతే వెళ్లి చేరిపోయి.. చాలా కాలం ప‌నిచేసింది. వీజేగా బాగా పాపుల‌ర్ అయింది. త‌ర్వాత సినీ రంగంలోనికి ప్ర‌వేశించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళీ భాష‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ 22 చిత్రాల్లో న‌టించింది. ఈ హాటు భామ తెలుగులో అడ‌వి కాచిన వెన్నెల సినిమాలో భ‌ర్త నిరాద‌ర‌ణ‌కు గురై.. వేరొక‌రితో సంబంధం పెట్టుకునే గృహిణి పాత్ర‌లో మెప్పించింది. పూజా వ‌య‌సు 34 ఏళ్లు. 22 మార్చి 1984లో పుట్టింది.

పూజా రామ‌చంద్ర‌న్ తెలుగులో ల‌వ్ ఫెయిల్యూర్‌, స్వామి రారా, అడ‌వి కాచిన వెన్నెల‌, దోచేయ్‌, త్రిపుర‌, ద‌ళం, సిద్ధార్థ‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ‌ర‌ళ తెలుపునా ప్రియతో పాటూ తాజాగా నాని న‌టించిన కృష్ణార్జున యుద్ధంలో న‌టించింది. పూజా న‌టించిన దేవి శ్రీ ప్ర‌సాద్‌.. చిత్రం గ‌త ఏడాది సెన్షేష‌న్‌గా నిలిచింది. శ‌వంతో ముగ్గురు యువ‌కులు సెక్స్ చేసే స‌న్నివేశాల‌తో రిలీజ్ చేసిన ట్ర‌య‌ల‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో శ‌వంగా పూజా న‌ట‌న ఆక‌ట్టుకుంది. త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఏదైనా చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించే పూజా.. తాజాగా బిగ్‌బాస్ తెలుగులోనికి అడుగుపెట్ట‌డం ఊహించ‌ని ప‌రిణామం. పూజా హౌస్‌లోనికి రావ‌డం వ‌ల్ల వ‌చ్చే మార్పులేమీ ఉండ‌వు. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట ఏం జ‌రుగుతోందో తెలిసి.. ఇప్పుడు హౌస్‌లోనికి వ‌స్తున్నందున‌.. స్మార్ట్‌గా ప్లే ఆడేందుకు అవ‌కాశం ఉంటుంది.

బిగ్‌బాస్‌లో అంద‌రూ గాఢ నిద్ర‌లో ఉండ‌గా.. పూజా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా చాలా హాట్‌గా ప్ర‌వేశించింది. బిగ్‌బాస్ హౌస్‌లోనికి 43వ రోజు తెల్ల‌వారుజామున 4గంట‌ల‌కు అడుగుపెట్టింది. నెమ్మ‌దిగా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా న‌డుచుకుంటూ వెళ్లి.. సోఫాలో మొత్తం దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకుని ఉంటుంది. అప్పుడే నిద్ర‌లేచి అటుగా వ‌చ్చిన కౌశ‌ల్ సోఫాలో ఎవ‌రో ప‌డుకుని ఉండ‌డం చూసి.. ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. దుప్పటి తొల‌గించి చూసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పూజా ముఖం క‌నిపించ‌కుండా దాక్కుని ఉంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఈ రోజు బిగ్‌బాస్‌లో చూసి త‌రించాల్సిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -