Sunday, April 28, 2024
- Advertisement -

హీరోగా బిగ్‌బాస్-4 ఫేమ్ సోహేల్.. అదృష్టం అంటే ఇదే!

- Advertisement -

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 సీజన్‌లో మూడో ప్లేస్‌లో నిలిచిన సోహైల్‌ ప్రజల్లో విన్నర్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ 4 టాప్‌ 3లో ఉన్న కంటెస్టెంట్‌ సోహైల్‌ ఫైనల్‌ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు. విన్నర్‌ సాధించినంత ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాదు సోహేల్ కి నాగార్జున పది లక్షలు ఇచ్చాడు.

ఇదే ఇప్పుడు సోహెల్ కి కలిసి వచ్చిన అదృష్టం.జార్జిరెడ్డి, ప్రెషర్‌ కుక్కర్‌ సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. దర్శకుడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి సోహైల్‌ దగ్గరకు తీసుకెళ్లగా కథ విన్న అతడు ఓకే కూడా చెప్పాడు. 

ఈ విషయాన్ని ఆ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. మరోవైపు సోహెల్ తానే స్వయంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు.. ఆ సమయంలో చిరంజీవి కూడా తనకు ఓ పాత్ర ఇవ్వమని అనడంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

అంతే కాదు సోహెల్ చిత్రంలో ఫ్రీగా బ్రహ్మానందం నటించడానికి ముందుకు వచ్చారు. ఇక సోహెల్ చేయనున్న సినిమాను ప్రమోట్ చేస్తామని బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలెలో చిరంజీవి, నాగార్జున చెప్పారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకే సోహెల్‌కు హీరోగా అవకాశం రావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -