Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌మెట్ భర్త అరెస్ట్‌..!

- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌మెట్ భ‌ర్త అరెస్ట్ అయ్యాడ‌ని వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.అయితే మ‌న తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ కాకపోవ‌డంతో అంద‌రు ఊపిరి పిల్చుకున్నారు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…హిందీ బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌ భర్త వ్లాద్‌ స్టానెస్కును లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిందీ బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల సిరీస్ మధ్యలోనే వైదొలగి పాపులర్ అయిన మోడల్ సోఫియా హయత్. సింగర్, మోడల్ అయిన సోఫియా 2016లో సన్యాసినిగా మారినట్లు ప్రకటించి.. ఆపై మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ కూడా చెప్పారు.

2017లో రొమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సోఫియా. గత కొంతకాలం నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. తనను గొంతునులిమి హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తూ భర్త వ్లాద్‌పై గత నెలలో లండన్‌ పోలీసులకు సోఫియా ఫిర్యాదు చేశారు. నెల రోజులు తర్వాత లండన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో సోఫియా భర్త వ్లాద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -