నూతన్ నాయుడు ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. బిగ్‌బాస్ రెండో సీజన్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చాడు నూతన్ నాయుడు. అంతకుముందు ప్రజరాజ్యం పార్టీ తరుపున ఎన్నికలలో కూడా పోటీ చేశాడు. ఆయన జనసేన పార్టీలో చేరి వైజాగ్ లో ఓ నియోజకవర్గం తరఫున పోటీ చేయాలని భావిస్తున్నాడు.తాజాగా నూతన్ నాయుడుకు కొన్ని సినిమాలలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.
వెంకీ , వరుణ్ కాంబినేషన్‌లో వస్తున్న F2 సినిమాలో నూతన్ నాయుడికి ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తన పాత్రకి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందని సమాచారం. మరి సినిమాలో నూతన్ నటన చూసిన తరువాత అతనికి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్‌లు నటిస్తున్నారు.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
