Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ నుంచి ఆగని లీకులు

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ 2ని వరుస లీకులు టెన్షన్ పెడుతున్నాయి. ఆ షో సక్సెస్ సీక్రెట్ సస్పెన్స్ మెయింటైన్ చేయడమే. ఎవరు ఎలిమినేట్ అవుతారో చివరి నిముషం వరకూ గోప్యంగా ఉంచి కంటెస్టెంట్స్ మధ్య ఉత్కంఠతతో పాటు ప్రేక్షకుల్లో టెన్షన్ పెంచడం వల్ల హిట్ అవుతోంది. కానీ బిగ్ బాస్ 2 సీజన్ లో లీకుల మీద లీకులు వచ్చేస్తున్నాయి. పోనీ ఆ లీకులు ఫేక్ న్యూస్ అనుకుంటే అదీ కాదు. పక్కా ఆధారాలతో ఫొటోలతో లీక్స్ వస్తున్నాయి. ఆ వెంటనే ఒకటి రెండు రోజుల్లో వాటిని నిజం చేస్తూ ఎలిమినేట్ అయిపోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, గెస్ట్ ఎంట్రీ, రీ ఎంట్రీ అన్ని విషయాల్లోనూ లీకులే లీకులు. తాజాగా ఈ శనివారం నందిని రాయ్ ఎలిమినేట్ అయిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. కౌషల్ 80 శాతం ఓట్లుతో సేఫ్ జోన్ లో ఉండగా, 7 శాతం ఓట్లుతో దీప్తి నల్లమోతు, 6 శాతం ఓట్లుతో బాబు గోగినేని, 4 శాతం ఓట్లుతో గణేశ్, 3 శాతం ఓట్లుతో నందిని చివరి స్థానంలో నిలిచిందని తెలుస్తోంది. పలు వెబ్ సైట్స్, యూ ట్యూబ్ చానెల్స్ నిర్వహిస్తున్న వివిధ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కూడా దాదాపు ఇదే విధంగా ఫలితాలను చూపుతున్నాయి. పైగా ఇప్పటికే 50 రోజుల్లో 5 ప్రధాన లీకులు పక్కాగా నిజం అయ్యాయి. దీంతో నందిని ఎలిమినేట్ లీక్ న్యూస్ కూడా నూటికి నూరు శాతం నిజమని బిగ్ బాస్ ప్రేక్షకులు నమ్ముతున్నారు.

బిగ్ బాస్ షో అంటేనే.. పూర్తి భద్రత మధ్య ఇటు గాలి అటు, అటు గాలి ఇటు రాకుండా నిర్వహిస్తుంటారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అయినా 50 రోజుల్లో బిగ్‌బాస్‌ హౌస్ నుంచి 5 ప్రధాన లీకులు రావడంతో ఎక్కడ లోపముందో తేల్చేందుకు పరిశోధన జరిపారు నిర్వాహకులు.

యాంకర్ శ్యామల 28 వ రోజుఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఆమె ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ షో ప్రసారం కాకముందే స్నేహితులతో ఫొటోలు దిగి నెట్ లో పెట్టేసింది. దీంతో నిర్వాహకులు ఆ ఫొటోలు తొలగించాలని చెప్పడంతో శ్యామల వాటిని రిమూవ్ చేసింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆ వారం దీప్తి నల్లమోతు, శ్యామల, నందిని ముగ్గురు ఎలిమినేషన్ కు వచ్చారు. వారిలో శ్యామల ఎలిమినేట్ అయిపోయిందనే వార్త బిగ్ బాస్ చెప్పకముందే లీక్స్ ద్వారా ప్రేక్షకులకు తెలిసిపోయింది.

తేజ‌స్వి ఎలిమినేట్ అయినప్పుడూ ఇలాగే లీకు వ‌చ్చేసింది. దీప్తి నల్లమోతు, రోల్‌రైడా, త‌నీష్‌, సామ్రాట్‌, తేజ‌స్వి నామినేష‌న్ల‌లో ఆ వారం ఉన్నారు. వీరిలో సామ్రాట్, తనీష్, తేజశ్విలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంచనాలు భారీగా ఉండేవి. కానీ.. తేజ‌స్వి బ‌య‌ట‌కు వ‌చ్చేసిందంటూ ఆమె ఫ్రెండ్‌తో దిగిన ఫొటో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత రోజే తేజశ్వి ఎలిమినేట్ అయింది.

వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా పూజా రామ‌చంద్ర‌న్ వ‌స్తోందంటూ రెండు రోజుల ముందే లీక్స్ వచ్చాయి. అదీ నిజమైంది. ఈ లీక్ వచ్చిన రెండు రోజులకు తెల్లవారుజామున హౌస్ లో ఆమె ప్రత్యక్షమయింది.

రీ ఎంట్రీ విషయంలోనూ ఈ లీకుల గోల తప్పలేదు. యాంకర్ శ్యామ‌ల‌, నూత‌న్ నాయుడు మ‌ళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోనికి వ‌స్తున్నారంటూ ముందే తెలిసిపోయింది. యాంక‌ర్ ప్ర‌దీప్ కూడా బిగ్‌బాస్‌లోనికి వస్తున్నాడంటూ లీకులు వచ్చాయి. ఆయన ఎంట్రీని వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా చూపి హడావుడి చేయాలని నిర్వాహకులు ప్రయత్నం చేశారు. కానీ.. ప్ర‌దీప్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కాద‌ని.. కేవ‌లం గెస్ట్‌గా త‌న కొత్త షో ప్ర‌మోష‌న్ కోసం వ‌చ్చాడ‌ని ముందే లీకైపోయింది. ఆయన అక్కడ షోలో కనిపించిన తర్వాత రోజే వైజాగ్ లో ప్రత్యక్షమయ్యాడు.

ఇలా ఇన్ని లీకులేంటని బిగ్ బాస్ నిర్వాహకులు ఎంక్వైరీ చేశారు. కారణాలూ తెలుసుకున్నారు. తెలుగు బిగ్ బాస్ 1 ను పూణేకు వంద కిలోమీటర్ల దూరంలోని లోనావాలా అటవీ ప్రాంతంలోని బిగ్ బాస్ హౌస్ సెట్ వేసి నిర్వహించారు. కంటెస్టెంట్లను విమానాల్లో తీసుకెళ్లేవారు. ఎలిమినేట్ అయ్యాక అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నే 24 గంటలకు పైగా పట్టేది. దీనికి తోడు ఆ షోకు కెమెరా, ఎడిటింగ్, ఇతర సాంకేతిక నిపుణులు, హౌస్ ను శుభ్రం చేసే స్టాఫ్, మేకప్ టీం, హెయిర్ డ్రెస్సర్స్ అందరూ స్థానికులే కావడం, తెలుగు రాని వాళ్లు, కంటెస్టెంట్ల గురించి తెలియనివాళ్లు కావడంతో లీకుల బెడద లేకుండా పోయింది.

కానీ బిగ్ బాస్2 హౌస్ హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో నిర్మించడం ఈ లీకులకు ప్రధానకారణమయింది. తెలుగు వీడియో ఎడిటర్స్, కెమెరా మెన్, ఇతర టెక్నీషియన్స్, శానిటరీ సిబ్బంది, మేకప్, హెయిర్ డ్రెస్సర్స్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారే. వీరికి కంటెస్టెంట్స్ గురించి తెలుసు. దీంతో ఎప్పుడు ఏం జరిగినా క్షణాల్లో బయటకు లీక్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా వచ్చిన నందిని రాయ్ ఎలిమినేషన్ లీక్ తో పాటు గతంలో వచ్చిన ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, గెస్ట్ ఎంట్రీస్, రీ ఎంట్రీస్ అన్ని లీకులకు కారణాలు ఇవే. ఈ విషయాలను బిగ్ బాస్ నిర్వాహకులు గుర్తించినా, ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఈ అనుభవాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ 3 లో ఇలాంటివి జరగకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -