Friday, May 17, 2024
- Advertisement -

ముందు కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకో : బాబు గోగినేని

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి మ‌రింత మ‌సాలా యాడ్ చేస్తున్నారు.గురువారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కొన్ని ఆసక్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.గురువారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ న‌డిచింది. ముందుగా పూజా రామచంద్రన్ కు ఒక టాస్క్ ఇచ్చి ఆమెను మెప్పించిన నలుగురి పేర్లు చెప్పమని అడగగా.. అమిత్, సామ్రాట్,గీతా మాధురి, దీప్తి నల్లమోతుల పేర్లు చెప్పింది పూజా. ఈ నలుగురు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఈ న‌లుగురు టేబుల్ మీద క‌ద‌ల‌కుండా నిల‌బ‌డల‌ని ఎవ‌రైతే చివ‌రి వ‌ర‌కు అలా ఉంటారో వారు ఈ వారం కెప్టెన్ అవతార‌ని బిగ్‌బాస్ తెలుపుతాడు. ఈ టాస్క్‌లో చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డి విజ‌యం సాధించింది.

గీతామాధురి..టాస్క్ సమయంలో దీప్తి నల్లమోతుపై బాబు గోగినేని వెనుక నుండి నీళ్లు వేయడంతో ఆ ఫోర్స్ కు కిందకి దిగిపోయింది. దీప్తి ఓడిపోవడానికి కారణం బాబు గోగినేని అని తనకు అనిపిస్తుందని గీతామాధురి రోల్ రైడా, గణేష్ ల వద్ద ప్రస్తవాయించింది.ఆ సమయంలో అక్కడకి వచ్చిన బాబు గోగినేని గీతామాధురిపై ఫైర్ అయ్యాడు.గ్రూపులు కట్టడం మానేసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకో’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. దీంతో షాక్‌లో ఉన్న గీతా తేరుకుని బాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.అయిన బాబు గీతా మాట‌లు విన‌కుండా గీతా మాధురిపై రెచ్చిపోయాడు.నా గేమ్ నేను పెర్ఫెక్ట్ గా ఆడుతున్నా మీకు నచ్చకపోతే నామినేట్ చేసుకోండి అంటు గీతా కూడా బాబు గోగినేనిపై ఫైర్ అయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -