Friday, May 3, 2024
- Advertisement -

ఒలింపిక్స్ నిర్వహిస్తామంటారు.. క్రికెట్ ను అడ్డుకుంటారు

- Advertisement -

ఇదేం కక్ష సాధింపు? విద్యార్థులు క్రికెట్ ఆడుకోవడం కూడా తప్పేనా ? మీకు ఎటూ చేతకాదు, మీలో ఎటూ క్రీడాస్ఫూర్తి లేదు. కనీసం మేం నిర్వహించే టోర్నమెంట్స్ కి అయినా మద్దతు పలుకుతారు అంటే అదీ లేదు. పోనీ సపోర్ట్ చేయక్కర్లేదు. కనీసం అడ్డంకులు, బెదిరింపులు లేకుండా చేస్తే అదే పదివేలు. కానీ టీడీపీ ప్రభుత్వం అదీ చేయదు. నా పై కక్ష గట్టింది, నా నియోజకవర్గం నగరిలో వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనీయకుండా అడ్డుకుంటోంది. డ్రిల్ మాస్టర్లను పంపించాలని కోరుతూ ఈ నెల 21న జిల్లా కలెక్టర్ కు కోరాను. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ అంగీకారం తెలిపారు. డ్రిల్ మాస్టర్లను పంపిస్తామన్నారు. తీరా చూస్తే టీడీపీ బెదిరింపులతో మాట తప్పారు. ఓ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించుకునే హక్కు నాకు ఉంది. కానీ నాపై కక్ష సాధింపుల్లో భాగంగా ఇలా టోర్నమెంట్ ను అడ్డుకుంటే నేను ఊరుకోను. ప్రభుత్వంపైనా కలెక్టర్ పైనా కోర్టుకెళ్తాను.. అంటూ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు వైఎస్ఆర్ సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఆమె ఆహ్వానించారు. కానీ ఆటలు ఆడించాల్సిన డ్రిల్ మాస్టర్లు రాకపోవడంతో టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని రోజా హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు సరిపడా వసతులు, మౌలిక సదుపాయాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఏర్పాటుకు కృషి చేస్తామని రోజా హామీ ఇచ్చారు. రోజా ఆవేదనలో ఆగ్రహంలో అర్ధం ఉంది. ఓ వైపు అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ సత్తా చాటుతాం. అంటూ టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు ఇలా నియోజకవర్గ స్థాయిలో విద్యార్ధులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంటే మోకాలడ్డడం ఛండాలంగా ఉంది. ఓ ఎమ్మెల్యేగా రోజా తన నియోజకవర్గంలో ఆటల పోటీలు నిర్వహిస్తే, యూత్ ఆమెకు సపోర్ట్ చేస్తారనే భయంతో, నగరి నియోజకవర్గ యువత టీడీపీకి దూరమవుతారని అక్కసుతో ఇలా చీప్ పోలటిక్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తాం…అని చెప్పుకునే వాళ్లు నియోజకవర్గ స్థాయిలో గల్లీ క్రికెట్ ను అడ్డుకోవడం వారికే సిగ్గుచేటు. క్రీడల మీద వారికి ఉన్న శ్రద్ధ, క్రీడాకారుల మీద ఉన్న గౌరవం ఏ పాటివో వాళ్లు ఆడుతున్న రాజకీయ క్రీడ చెప్పకనే చెప్పింది. ఇలాంటి క్రీడారాజకీయాలు మానుకుని, క్రీడాస్ఫూర్తితో వెళ్తే టీడీపీ నేతలకే మంచిది. లేదంటే అసలే ఫైర్ బ్రాండ్ రోజా నోటికి పని చెబుతుంది. ఇక రేపటి నుంచి మీ పరువును అంతర్జాతీయ స్థాయిలో రోజా తీసేయడం ఖాయం. సో ఇలాంటి రాజకీయక్రీడలకు స్వస్తి చెప్పి, ఆటాడుకుందాం…రా..అని పిలవండి. క్రీడలను వేరుగా రాజకీయాలను వేరుగా చూడంండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -