Monday, April 29, 2024
- Advertisement -

త‌నీష్ విన్న‌ర్ కావ‌డానికి బిగ్‌బాస్ విశ్వప్ర‌య‌త్నాలు

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.మ‌రో రెండు వారాల‌లో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో అని ఆస‌క్తి అందరిలోను నెల‌కొంది.బ‌య‌ట ప్రేక్ష‌కుల అంచ‌నాల ప్రకారం హౌస్‌మెట్స్ అంద‌రి క‌న్నా కౌశ‌ల్‌కు బ‌య‌ట ఫాలోయింగ్ ఎక్కువ.దీంతో అంద‌రు బిగ్‌బాస్ విజేత‌గా కౌశ‌ల్ నిలుస్తాడ‌ని అంద‌రు భావిస్తున్నారు.కాని ప్ర‌స్తుత ప‌రిణ‌మాల‌ను చూస్తుంటే కౌశ‌ల్ బిగ్‌బాస్ విజేత కాలేడ‌ని అనిపిస్తుంది. బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో షో కన్నా కౌశ‌ల్ ఎక్కువ హైలెట్ అయ్యాడు.

దీంతో అత‌నిని బ‌య‌టికి పంపించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.దీనిలో భాగంగానే గీతా మాధురికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి అందులో విజేత‌గా నిలిస్తే ఈ సీజ‌న్ మొత్తం ఒక‌రిని ఎలిమినేట్ చేసే అవ‌కాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌.అప్ప‌టికే గీతాకు కౌశ‌ల్‌కు మ‌ధ్య గొడ‌వ‌లు ఉండ‌టంతో గీతా క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా కౌశ‌ల్‌ను ఎలిమినేట్‌కు నామినేట్ చేసింది.ఇక గ‌తవారం ఎక్కువ ఓట్లు వ‌చ్చిన నూత‌న్ నాయుడిని కూడా హౌస్ నుంచి బ‌య‌టికి పంప‌డం కూడా దీనిలో వ్యూహంగానే తెలుస్తుంది.కౌశ‌ల్‌ను ఎట్టి ప‌రిస్థితుల‌లో బిగ్‌బాస్‌ను విన్న‌ర్ కాకుండా చేయ‌ల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.త‌నీష్‌ను బిగ్‌బాస్ విన్న‌ర్ చేయ‌డానికి ఓ వ‌ర్గం అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున‌ట్లు స‌మాచారం.వీరికి బిగ్‌బాస్ హౌస్ట్ నాని కూడా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో అత‌నిని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై నాని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.కాని నాని కూడా త‌నీష్‌కు మ‌ద్ద‌తుగా ఉన్నాడ‌ని చాలామంది న‌మ్ముతున్నారు.ఎప్పుడో ఎలిమినేష‌న్ కావాల్సిన త‌నీష్‌ను ,సేవ్‌ చేస్తు ఇక్క‌డి వ‌ర‌కు తీసుకువ‌చ్చారని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లు ఆడే గేమ్‌లో భాగంగానే నాని ప్ర‌తివారం త‌నీష్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా న‌టిస్తున్న‌డ‌ని చాలా మంది అభిప్రాయ‌డుతున్నారు.త‌నీష్‌ను బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విజేత‌గా ప్ర‌క‌టిస్తే షోపై వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయం.దీంతో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ చేయ‌లంటే ఆలోచ‌న చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.ఇదే క‌నుక జ‌రిగితే బిగ్‌బాస్ బ్రాండ్‌కు పెద్ద మ‌చ్చ‌గా నిలుస్తుంది.ఇవ‌న్ని క్షుణంగా ప‌రిశీలిస్తున్న బిగ్‌బాస్ టీం ముందుగానే సేఫ్‌గా త‌నీష్‌ను కాకుండా గీతా మాధురిని కూడా ఒక ఆప్ష‌న్‌గా పెట్టుకున్నారని తెలుస్తుంది.మ‌రి ఇన్ని స‌మస్య‌ల మ‌ధ్య బిగ్‌బాస్ విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తారో చూడాలి. ప్ర‌జ‌ల చేత ఓట్లు వేయించుకుని ,ప్ర‌జ‌ల‌నే పిచ్చోళ్ల‌ను చేస్తుంది ఈ బిగ్‌బాస్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -