Saturday, May 4, 2024
- Advertisement -

అసెంబ్లీ ర‌ద్దు తీర్మానాన్ని ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్‌…

- Advertisement -

తెలంగాణాలో అసెంబ్లీ ర‌ద్దురై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న తీర్మానాన్ని గవరనర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి. అసెంబ్లీ రద్దు అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి.. అసెంబ్లీ రద్దు తీర్మానం ప్రతిని అందజేశారు. దీనిని పరిశీలించిన నరసింహన్ గడువుకు ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్.. కేసీఆర్‌ను కోరారు.. దీనికి సీఎం అంగీకరించారు.

దీంతో అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -