Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్ నుంచి నూత‌న్ నాయుడు ఔట్‌…కుప్ప‌కూలిన కౌశ‌ల్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో 68వ రోజు అనూహ్య సంఘ‌ట‌న చోటు చేసుకుంది.శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ న‌డిచింది.టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ నూతన్ నాయుడు గాయపడటం, అతడి గాయం తీవ్రమైనదన్న విషయాన్ని గుర్తించటంతో ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న కౌశ‌ల్ అక్క‌డిక్క‌డే కుప్పకూలిపోయాడు. షో మొద‌టి నుండి నూత‌న నాయుడు,కౌశ‌ల్ మ‌ధ్య మంచి స్నేహ బంధం కొన‌సాగుతుంది.హౌస్‌మెట్స్ అంద‌రు కౌశ‌ల్‌ను వ్య‌తిరేకించిన‌ప్ప‌టికి ,రీ-ఎంట్రీ ఇచ్చిన నూత‌న్‌ నాయుడు మాత్రం కౌశ‌ల్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచాడు.

ఇంటి స‌భ్యులు సైతం నూత‌న నాయుడు హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లుతున్నాడ‌ని తెలిసి విస్మయానికి గురి కావటమే కాదు.. తీవ్ర వేదనకు లోనయ్యారు.ఇక తీవ్ర గాయమైన నూతన్ నాయుడిను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నూత‌న్ నాయుడు హౌస్ నుండి బ‌య‌టికి వెళ్ల‌డం కౌశ‌ల్‌కు పెద్ద దెబ్బ అని చెప్పవ‌చ్చు.ఎందకంటే హౌస్ కౌశ‌ల్‌కు స‌పోర్టుగా అత‌ను ఒక్క‌డే నిల‌బ‌డుతున్నాడు.నూత‌న్ నాయుడు హౌస్ నుంచి వెళ్లిపోతున్నాడ‌ని తెలియగానే కౌశ‌ల్ క‌న్నీరు పెట్టుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -