Monday, April 29, 2024
- Advertisement -

పాక్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్‌.. ముందు వ‌రుస‌లో సిద్ధూ

- Advertisement -

పాకిస్థాన్ లో నవ శకం ప్రారంభమైంది. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఇమ్రాన్ ఖాన్ చేత పాక్ అధ్యక్షుడు మామ్మూస్ హుస్సేన్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన భార్య బుష్రా ఇమ్రాన్, ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీతో పాటు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, వసీం అక్రమం, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్, నటుడు జావిద్ షేక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తన స్నేహితుడైన సిద్ధూను తొలి వరుసలోనే కూర్చోబెట్టి, గౌరవించారు ఇమ్రాన్ ఖాన్. ప్రమాణస్వీకారం సమయంలో సిద్ధూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

స్పీకర్‌ అసాద్‌ ఖైసర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఇమ్రాన్‌ ఖాన్ తరఫు సభ్యులకు ‘ఏ’ లాబీ, షెహబాజ్‌ మద్దతుదారులకు ‘బి’ లాబీ కేటాయించారు. ఓపెన్‌ బ్యాలెట్‌ పద్దతిన సాగిన ఈ ఓటింగ్‌లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్క సభ్యుడు ముందుకు వచ్చి తాము మద్దతివ్వబోయే వారి పేరు చెప్పి వారికి కేటాయించిన లాబీల్లో కూర్చున్నారు. దీంతో ఇమ్రాన్‌కు 176మంది సభ్యుల మద్దతు లభించింది. ప్రస్తుతం నేషనల్‌ అసెంబ్లీలో పీటీఐ పార్టీకి చెందిన సభ్యులు 152మంది సభ్యులు ఉన్నారు. పీటీఐ పొత్తు పెట్టుకున్న పార్టీల సభ్యులతో కలిపి సభ్యుల సంఖ్య 183కు చేరింది.

సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్‌ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం ఆనవాయితీ. దీని ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ ఓట్లు రావాలి. పార్లమెంట్‌లోని 342 సభ్యులకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 ఓట్లురావాలి. ఇమ్రాన్‌ఖాన్‌కు 176ఓట్లు రావడంతో ఆయన ప్రధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.కిస్థాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హుస్సేన్.. ఇమ్రాన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో జరిగింది. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -