Sunday, May 19, 2024
- Advertisement -

మ‌ళ్లీరావా రివ్యూ

- Advertisement -

అక్కినేని కుటుంబంలో అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు మ‌న‌వ‌డిగా వ‌చ్చిన సుమంత్‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆయ‌న‌ను అక్కున చేర్చుకోలేదు. న‌ట‌న‌ప‌రంగా ఉన్నా స‌క్ర‌మంగా ఆడ‌క అక్కినేని మ‌న‌వ‌డు ఇబ్బందులు ప‌డుతున్నాడు. ‘సత్యం’, ‘గోదావరి’, ‘మధుమాసం’ ‘గోల్కొండ హైస్కూల్‌’ వంటి సినిమాలు బాగున్నా సోసో ఆడాయి. గతేడాది ‘నరుడా డోనరుడా’ అనే సినిమాతో వ‌చ్చినా ఫ‌లితం ఆశించ‌నంత లేదు. 22 సినిమాలు చేసినా ఆశించిన విజ‌యాలు లేవు. ఇప్పుడు కొత్త అంశంతో చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీరావా అని వ‌స్తున్నాడు. ఆ సినిమా శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 8న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చూద్దాం ఎలా ఉంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ సుమంత్‌ను మ‌ళ్లీరావా అని పిలుస్తుందో లేదో చూడాలి.

క‌థ: కార్తీక్ (సుమంత్‌), అంజలి(ఆకాంక్ష) ప్రేమ జంట. ఇద్ద‌రు చిన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడతారు. పరిస్థితులు వారికి ఎదురు తిరిగి విడగొడతాయి. అంజలి కుటుంబం రాజోలి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత 13 ఏళ్లకు ఆఫీస్ ప‌ని మీద హైద‌రాబాద్ వ‌స్తుంది. అక్క‌డ అనుకోకుండా కార్తీక్‌ను క‌లుస్తుంది. అప్పుడు ఇద్ద‌రు ఒక‌రినొక‌రు త‌మ ప్రేమ‌ను పంచుకుంటారు. చిన్న‌ప్ప‌టి ప్రేమ‌ను గుర్తు చేసుకొని వివాహం చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకుంటారు. చిన్నప్పటి స్నేహాన్ని పెళ్లిగా మార్చుకుందామ‌ని రిజిస్టర్‌ ఆఫీస్‌కు వెళ్తారు. అప్పుడే హీరోయిన్ త‌న‌కీ పెళ్లి ఇష్టం లేద‌ని అంజలి షాక్ ఇస్తుంది. అసలు ఏం జరిగింది? ఎలాం ఎందుకు చెప్పాల్సి వ‌స్తుంది. చివ‌రికి కార్తీక్‌, అంజ‌లి ఒక్క‌ట‌య్యారా అనేది చూడాలి. మరోసారి విడిపోయిన వాళ్లిద్దరూ మళ్లీ క‌లుస్తారా లేదా? అనేది సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్‌: రెండుసార్లు విడిపోయి క‌లుసుకుంటారు హీరో, హీరోయిన్లు. మంచి ఫీల్ గుడ్ సినిమాగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో సుమంత్‌, ఆకాంక్ష‌ల న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. సాధార‌ణ ప్రేమ క‌థ‌నే ఇది. కానీ విభిన్నంగా తీశాడు. బాల్యాన్ని, మ‌ళ్లీ ప్రెజెంట్‌ను క‌లిపి తీశాడు. ఈ సినిమాలోని ప‌లు సన్నివేశాలు మంచి వినోదాన్ని అందించాయి. ప్రేమ‌క‌థ‌ను మూడు స్టేజ‌స్‌ల‌ను క‌లిపి తెర‌కెక్కించాడు. ఆ స‌న్నివేశాల‌ను స‌మాంత‌రంగా ముడి పెడ‌తూ న‌డిపించాడు. మిర్చి కిర‌ణ్ కామెడీ న‌వ్వులు పండిస్తుంది. క‌థలో మలుపులు, పతాక సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. శ్ర‌వ‌ణ్ పాట‌లు సన్నివేశానికి అనుగుణంగా వ‌చ్చి ఆహ్లాద‌క‌రంగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హాస్యం, భావోద్వేగాలు, క‌థ‌, క‌థ‌నంతో సినిమా బాగానే న‌డిచింది.

మైన‌స్‌:స్క్రీన్ ప్లే కూడా 2017 నుంచి 1999, వెళ్లి మళ్లీ 2012కు నడిపించ‌డం కొంచెం విసుగ్గా ఉంది. కొంచెం సాగ‌దీసిన మాదిరిగా ఉంది. కొంచెం డైరెక్ట‌ర్ త‌డ‌బ‌డ్డాడు. సినిమా ప్రారంభం క‌థ తీరు ప్రేక్ష‌కుడిని కాస్త తిక‌మ‌క పెడుతుంది.అయితే ఫైన‌ల్‌గా మ‌ళ్లీ ఓ ఫీల్‌గుడ్ సినిమా వ‌చ్చింది. అయితే థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ రావా వ‌చ్చేంత సినిమా లేదు. ప‌రిశ్ర‌మ‌లో సుమంత్ కొన‌సాగ‌డానికి ఈ సినిమా ఒక అవ‌కాశం ఇచ్చింది.

న‌టీన‌టులు: సుమంత్‌, ఆకాంక్ష‌, మిర్చి కిర‌ణ్‌, కార్తీక్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గౌత‌మ్ తిన్న‌నూరి
సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్క‌
స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -