Saturday, May 18, 2024
- Advertisement -

ప్రొమోలో రెచ్చిపోయిన నాని

- Advertisement -

శ‌నివారం వ‌స్తే బిగ్‌బాస్‌లోకి నాని వ‌స్తాడు , వ‌స్తు వ‌స్తునే షోకి మ‌రింత జోష్ తీసుకువ‌స్తాడని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు .ఇక ఈ రోజు నాని బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌తో త‌న‌దైన స్టైల్లో ఆడుకున్నాడు.దీనికి సంంబంధించిన ప్రొమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్ టీం. ఈ వారం జరిగిన కాల్ సెంట‌ర్ టాస్క్ గురించి చ‌ర్చించిన నాని రోల్ రైడాతో స‌రాదాగా మాట్లాడాడు.నీకు సామ్రాట్‌కు మ‌ధ్య ఏమైనా గొడ‌వ‌లు ఉన్నాయా అని రోల్‌ను ప్ర‌శ్నించాడు నాని.ఇక కాల్ సెంట‌ర్ టాస్క్‌లో భాగంగా నూత‌న్ నాయుడు రోల్‌కు మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను నాని ప్ర‌స్తావించాడు.పొలిటిష‌న్ అంటు నూత‌న్ నాయుడు గారిని బోల్తా కొట్టించిన నువ్వు ఎంత పెద్ద పొలిటిష‌న్‌వో అర్థం అవుతుంద‌ని రోల్ రైడాను ఆట‌ప‌ట్టించాడు .గ‌ల్లీ వాళ్లు త‌లుచుకుంటే పొలిటిష‌న్స్‌ను కూడా కొడ‌తార‌ని చెప్పిన రోల్ రైడాను ఆకాశానికి ఎత్తేశాడు నాని. హైదరాబాద్‌లో గ‌తంలో అన్ని గ‌ల్లీలే అని చెప్పుకొచ్చాడు.20 సంవ‌త్స‌రాల క్రితం బంజారా హిల్స్‌,జూబ్లీహిల్స్ ఎక్క‌డ ఉన్నాయ‌ని,ఇప్పుడు రోడ్ నెం 1,రోడ్డు నెం 2 అని పిలుచుకుంటున్నామ‌ని చెప్పుకొచ్చాడు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -