Monday, April 29, 2024
- Advertisement -

కౌశ‌ల్ పాత్ర‌లో రెచ్చిపోయిన దీప్తి

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది.ఈ వారంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు ఐదుగురు స‌భ్యులు చేరిన సంగ‌తి తెలిసిందే.వీరిలో ఎవరు బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.గ‌త వారం హాట్ హాట్‌గా న‌డిచిన షో,ఈ వారం కాస్తా ప్ర‌శాంతంగా న‌డుస్తుంది.రెండో సీజ‌న్ చివ‌రి వారం కావ‌డంతో హౌస్‌మెట్స్ అంద‌రు క‌లివిడిగా ఉంటున్నారు.ఇక సోమ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మెట్స్ అభిప్రాయ‌ల‌ను తీసుకున్నారు బిగ్‌బాస్. మీతోపాటు ఫైన‌ల్‌కు అర్హులు ఎవ‌రో,అన‌ర్హులు ఎవ‌రు,దానికి గ‌ల కారణలను కూడా చెప్పాల‌ని కోరడంతో హౌస్‌మెట్స్ త‌మ అభిప్రాయ‌ల‌ను తెలియ‌జేశారు.

ఎప్ప‌టిలాగే హౌస్‌మెట్స్ అంద‌రు కౌశ‌ల్ ఫైన‌ల్‌కు అనర్హుడిగా త‌మ అభిప్రాయ‌ల‌ను చెప్ప‌డం జ‌రిగింది.తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగే ఎపిసోడ్ ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్ టీం.హౌస్‌మెట్స్‌కు ఈ సీజ‌న్‌కు ఇదే లాస్ట్ టాస్క్ కావ‌డంతో కాస్తా వెరైటీ ఈ టాస్క్‌న్ డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది.లాస్ట్ వీక్ మ్యాడ్‌నెస్ ఇన్ ది హౌస్ అనే పేరు మీద ఈ టాస్క్‌ను బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌కు ఇవ్వ‌డం జ‌రిగింది.టాస్క్‌లో భాగంగా ఒక‌రి రోల్స్ మ‌రోక‌రికి ఇవ్వ‌డం జ‌రిగింది.కౌశ‌ల్ రోల్‌ను దీప్తికి ఇచ్చిన‌ట్లు ప్రోమోని చూస్తే అర్థం అవుతుంది.సామ్రాట్‌,త‌నీష్‌లు ..గీతా మాధురి,దీప్తి పాత్ర‌లు చేస్తున్న‌ట్లుగా ఈ ప్రోమోని చూస్తే అర్థం అవుతుంది.ఈ ప్రోమోని బ‌ట్టి ఈ రోజు ఎపిసోడ్ స‌రాదాగా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -