Sunday, May 19, 2024
- Advertisement -

కౌశ‌ల్ ని టార్గెట్ చేసిన నాని.. రోల్‌రైడా, గీతా మాధురికి క్లాస్

- Advertisement -

బిగ్‌బాస్ 96, 97వ రోజు షోలో హాట్‌హాట్‌గా నాని ఫైర్ అయినట్టు ప్రోమో వదిలారు. వారాంతం ఎపిసోడ్ కావడం, అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండటం శనివారం ప్రసారమయ్యే సాధారణంగానే ఆసక్తి ఉంటుంది. దానికి తోడు రోల్ రైడాకు, కౌశల్‌కు హోస్ట్‌కు నాని గట్టిగా క్లాస్ పీకడం మరోసారి బిగ్‌బాస్ హౌస్ హీటెక్కనున్నట్టు స్పష్టంగా కనిపించింది.

రోల్ రైడా.. బిగ్‌బాస్ హౌస్‌లో మంచి అనిపించుకోవడమే కాదు. మంచి కోసం నిలబడటం కూడా చాలా ముఖ్యమైంది. మీకు ఓ తప్పనిపించవచ్చు. మరో కరెక్ట్ అనిపించవచ్చు. దానిని అక్కడికక్కడే అడిగే దమ్ము నీలో ఉందా లేదా అని నాని నిలిదీశాడు.

ఇక కౌశ‌ల్‌కి కూడా క్లాస్ పీకారు. కౌశల్ తనతో ప్రవర్తించిన తీరుని నానికి వివరించాడు. ‘కౌశల్ అన్నవా అని’ నాని అతడిని ప్రశ్నించగా కౌశల్ అవునని ఒప్పుకున్నాడు. తోటి హౌస్ మేట్ ని తక్కువ చేసి మాట్లాడడం పట్ల నాని.. కౌశల్ పై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు వచ్చిన ట్రాన్స్ లో ఉన్నానని కవర్ చేసే ప్రయత్నం చేయగా.. పిల్లలు ఆ తరువాత వచ్చారు అంటూ నాని అనడంతో కౌశల్ బ్లాంక్ అయిపోవడం ప్రోమోలో చూపించారు.

bigg boss2: deepthi to eliminate from house

కంటెస్టెంట్ గీతాకి క్లాస్ పీకినట్లు సమాచారం. కౌశల్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు పట్ల నానిని ఆమెని ప్రశ్నించి తప్పులు ఎత్తి చూపడంతో గీతా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. కౌశల్ ని కూడా టాస్క్ లలో సంచలకుడిగా సొంత రూల్స్ పెట్టుకోవడమేంటని ప్రశ్నించబోతున్నారట.

bigg boss2: amith eliminated from house

ఇక బిగ్‌బాస్‌లో ఈ వారం గీత, రోల్ రైడా, దీప్తి, అమిత్‌తోపాటు కౌశల్ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం అందరూ బలమైన అభ్యర్థులు కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. బిగ్ బాస్ తన ప్లాన్ ప్రకారం దీప్తిని బయటకి పంపబోతున్నారని టాక్. నిజానికి ఈ వారం నామినేషన్స్ లో దీప్తికి ఓట్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో ఆమెని బయటకి పంపితే మరోసారి ప్రజల ఓట్లకు విలువ లేదనే విమర్శలను ఈ షో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

Image result for bigg-boss2-deepthi

 

మ‌రో వైపు రోల్ రైడా, అమిత్ లలో అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి అమిత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వారం ఒక‌రు ఎలిమినేట్ అవుతారా లేకుంటే ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతార‌నేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -