- Advertisement -

నాన్ బెయిలబుల్ వారెంట్ తో టీడీపీకి మైలేజ్..?

- Advertisement -

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ప్రజల్లో మంచి మైలేజ్ రావాలంటే ఏం చేయాలి ? కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అందుకే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు టీడీపీ నాయకులు. బీజేపీ మీద కోపంతో రగిలిపోతున్న ప్రజల నుంచి సానుభూతి పిండుకోవాలి. అందుకే ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయించారు. అంటూ టీడీపీ నేతలు ఊరూవాడా దండోరా వేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నందుకే బెదిరిస్తున్నారని తమ అనుకూల మీడియాలో కథనాలు వండి వార్చేస్తున్నారు. మోడీని నిలదీస్తున్నందుకే కక్ష సాధింపు చర్యలను మండిపడుతున్నారు. అయినా భయపడం, వెనకడుగు వేయం. తాడో పేడో తేల్చుకుంటాం. అంటూ ఎప్పటిలాగానే టీడీపీ నాయకులు గట్టిగా మైకు పట్టుకుని మరీ చెబుతున్నారు.

కానీ అసలు విషయానికి వస్తే చంద్రబాబుకు కేసులు కొత్త కాదు. అత్యంత కీలకమైన 17 కేసుల్లోనే ఆయన స్టేలు తెచ్చుకుని, కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ముదురు. అలాంటి నాయకుడు ఓ చిన్న కేసుకే ఇంత భయపడిపోతాడా ? మోడీ నిజంగా ఇరికించాలనుకుంటే ఈ చిన్న కేసే కావాలా ? అంతకుమించి చంద్రబాబును, ఆయన పరివారాన్ని ఇబ్బంది పెట్టడానికి మోడీ దగ్గర అస్త్రాలే లేవా ? ఇంకే కేసులోనైనా ఇరికించగలడు కదా ? అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలు కూడా నిజమే. చంద్రబాబును ఇరికించాలంటే బాబ్లీ కేసు మాత్రమే అవసరం లేదు. పైగా టీడీపీ నేతలు ఎల్లో మీడియా చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల తర్వాత నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేయలేదు. ఇప్పటికే 50 సార్లకు పైగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని తెలుస్తోంది. పైగా పోనీ ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినంత మాత్రాన చంద్రబాబు కొంపేలం మునిగిపోవు. ఆయనను అరెస్ట్ చేసేసి జైలులు పడేయరు. కోర్టుకు ఫైన్ కట్టి, క్షమాపణ చెబితే చాలు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని ఒత్తిడి వల్ల హాజరుకాలేకపోయామని ఓ సారీ చెబితే సరి. ఈ విషయాలన్నీ టీడీపీ నేతలకు తెలిసిందే. కాకపోతే బాబ్లీ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేదుకు హైడ్రామాకు తెరలేపారు. అటు ఉత్తర తెలంగాణ ఎడారి అయిపోతుందని నాడు ధర్నా చేసినందుకు నేడు మాపై కక్షగట్టారు.

అని చెప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికల వేళ అటు కాంగ్రెస్ కూడా దీనపై రాద్ధాంతం చేస్తుంది. పొత్తులో భాగంగా టీడీపీకీ ఆ విషయం కలిసి వస్తుంది. ఇలా మోడీని ఎదిరించిన మొనగాడిగా ఏపీలో మైలేజ్, అటు ఉత్తర తెలంగాణ తాగునీటి కోసం పోరాడిన ధీరుడిగా అటు తెలంగాణలో ఓట్ల వర్షం. ఇలా ఆలోచించే బాబు, ఆయన అనుచరులు, ఎల్లో మీడియా అంతా కలసి బాబ్లీ కేసుపై ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ల స్ట్రాటజీ వర్కవుట్ అయింది. కానీ భవిష్యత్ లో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -