Saturday, April 20, 2024
- Advertisement -

ఓట‌మిభ‌యంతోనే కేసీఆర్ అలా..? అమిత్‌షా

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార హ‌డావుడీ మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే అధికార‌ప‌రా్టీ టీఆర్ఎస్ ప్ర‌చారంలో దూసుకుపోతుంటే భాజాపా కూడా ఓ అడుగు ముందుకేసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కాషాయం బాస్ అమీత్‌షా ఎన్నిక‌ల శంఖారావం పూరించారు.

బ‌హిరంగ స‌భ‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. జమిలి ఎన్నికలను సమర్థించిన కేసీఆర్‌ ఇప్పుడు ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. ఓటు బ్యాంకు‌ రాజకీయాల కోసమే ఆయన ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు.

మరోవైపు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణ దళితులకు ద్రోహం చేశారని, కనీసం ఇప్పటికైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అంటూ నిలదీశారు. తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయని, దళితులంతా రగిలిపోతున్నారని అమిత్‌షా అన్నారు.

‘మజ్లిస్‌‌కు భయపడే కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ చేయాలంటూ కేంద్రానికి తీర్మానం పంపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యంకాదని తెలిసి కూడా ఆ పని చేశాక‌ర‌ని మండిప‌డ్డారు.

మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ మధ్య పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుస్తామంటున్నారని, తెలంగాణలోనూ అదే మాట అన్నారని గుర్తుచేశారు. దేశమంతా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతోందని అమిత్‌షా జోస్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -