Saturday, May 4, 2024
- Advertisement -

ఈ వారం నందిని రాయ్ ఎలిమినేట్ పక్కా

- Advertisement -

బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ ను లీకులు గోల వదల్లేదు. ఈ వారం నందిని ఎలిమినేట్ అయిపోయిందని ఇప్పటికే ప్రచారం జోరుగా సాగిపోతోంది. కౌషల్, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, గణేశ్, నందిని ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ ఐదుగురిలో కౌషల్ ను సేవ్ చేయడానికి కౌషల్ ఆర్మీ చాలా యాక్టివ్ గా ఉంది. దాదాపు 12కోట్ల ఓట్లు ఈ వారం వేస్తే అందులో 80 శాతం వరకూ కౌషల్ కే పడినట్లు తెలుస్తోంది. మిగిలిన నలుగురిలో దీప్తి నల్లమోతుకు 7 శాతం ఓట్లు, బాబు గోగినేని 6 శాతం ఓట్లు, గణేశ్ కు 4 శాతం ఓట్లు, నందినికి 3 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఈ ఓటింగ్ శాతాన్ని బిగ్ బాస్ అధికారికంగా ప్రకటించకపోయినా వివిధ వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. వాటన్నింటి సారాశం ఒకటే. 70 నుంచి 80 శాతం ఓటింగ్ తో కౌషల్ దూసుకుపోతున్నాడు. మిగిలిన 20 నుంచి 30 శాతం ఓట్లనే మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అని. దీప్తి నల్లమోతు. బాబు గోగినేని, గణేశ్, నందిని ఈ నలుగురిలో ఏ ఒక్కరు కౌషల్ వైరం లేకుండా ఫ్రెండ్లీగా ఉన్నా సరే కౌషల్ ఆర్మీ, ఆయన అభిమానులు కచ్చితంగా సేవ్ చేసేవారు. కౌషల్ కు కోట్ల ఓట్లు వేసినట్లే ఎన్నో కొన్ని ఓట్లు వీరికీ వేసి కాపాడేవారు. కానీ ఈ నలుగురు కూడా కౌషల్ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తుడటంతో మీలో ఎవరు ఎలిమినేట్ అయినా మాకు హ్యాపీయే అని వదిలేశారు. ఓ దశలో గణేశ్, నందినికి సమానంగా ఓట్లు వచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ చెప్పడంతో కౌషల్ ఆర్మీ గణేశ్ ను సేవ్ చేయడానికి కాస్తా కూస్తో ఓట్లు వేసింది. దీంతో కేవలం ఒక శాతం అదనపు ఓట్లుతో అంటే నందినికి మూడు శాతం ఓట్లు వస్తే గణేశ్ కి నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఒక్క శాతంతోనే ఈ వారం గణేశ్ గట్టెక్కాడు.

అయితే ఏదైనా జరగొచ్చు అని బిగ్ బాస్ ముందు నుంచీ చెబుతున్నట్లు ఈ వారం డబుల్ ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటే గణేశ్, బాబు గోగినేని ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే గోగినేని ప్రియశిష్యుడు గణేశ్ అవుట్. ట్రిపుల్ ఎలిిమినేషన్ ఉంటే గురుశిష్యులు ఇద్దరూ ఎలిమనేట్ కావడం తప్పదు. అయితే యాంకర్ శ్యామల, తేజశ్వి, ఎలిమినేషన్ అయ్యారనే వార్తలు ఇప్పటికే లీకయ్యాయి. ఆ వార్తలు లీక్ నిజమేనని నిరూపిస్తూ ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్ అని లీక్ వచ్చింది. అదీ కూడా నిజమే అయింది. తర్వాత యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే లీక్ కూడా వాస్తవే అయింది. రీ ఎంట్రీ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల్ ఇస్తున్నారని మరో లీక్ వచ్చేసింది. అలా జరగదేమో..అని అనుమానించిన అనుమానాలు పటాపంచలైపోయాయి. వాళ్లిద్దరు కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు నందిని రాయ్ ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. అది కూడా నిజమయ్యే చాన్స్ నూటికి నూరు శాతం ఉంది. మరి ఈ లీకుల గోల బిగ్ బాస్ కు ఎప్పుడు తప్పుతుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -