Monday, April 29, 2024
- Advertisement -

గీతా నువ్వు ఇంకా ఎలిమినేట్ కాలేదా..?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మ‌రో రెండో రోజుల్లో ముగియ‌నుంది.బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు ఐదుగురు స‌భ్యులు వెళ్లిన సంగ‌తి తెలిసిందే.గీతా మాధురి,త‌నీష్‌,కౌశ‌ల్‌,సామ్రాట్‌,దీప్తిలు బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు చేరారు.వీరిలో ఎవ‌రు బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతున్నారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.తాజాగా ఈ రోజు ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్‌.ఈ రోజు ఎపిసోడ్‌లో రెండో సీజ‌న్ కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో సంద‌డి చేయ‌నున్నారు.తేజ‌స్వీ,దీప్తి సునైనా,అమీత్‌,కిరీటి,రోల్ రైడాలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మెట్స్‌కు షాక్ ఇచ్చారు.

తేజ‌స్వీ వ‌చ్చి రావ‌డంతోనే సామ్రాట్‌ను గ‌ట్టిగా హ‌గ్ చేసుకుంది.ఆ విధాంగానే దీప్తి సునైనాను కౌగిలించుకున్నాడు త‌నీష్.అమీత్ రోల్ రైడాలు క‌లిసి డ్యాన్స్ వేయడం మ‌నం ప్రోమోలో చూడవ‌చ్చు.తేజ‌స్వీ బాత్ రూమ్‌లో ఉన్న గీతాతో నువ్వు ఇంకా ఎలిమినేట్ అవ్వ‌లేదా అని స‌రదాగా ఆట‌ప‌ట్టించింది.హౌస్‌మెట్స్ అంద‌రు క‌లిసి డ్యాన్స్‌లు వేసి ఎంజాయ్ చేశారు.కౌశ‌ల్‌తో కిరీటి మాట్లాడుకోవ‌డం ఈ ప్రోమోలో క‌నిసించింది.ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో క‌నిపించ‌డంతో ఈ రోజు ఎపిసోడ్ సూప‌ర్‌గా ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -