Monday, May 20, 2024
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా మారిన ఈ వారం ఎలిమినేష‌న్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఫైన‌ల్ గంట మోగింది.ఎవ‌రు ఫైన‌ల్‌కు వెళ్తారు,ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్‌ని వ‌దిలి ఇంటికి వెళ్తారో మ‌రో వారంలో తెలిపోనుంది.సోమ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేష‌న్స్‌కు నామినేష‌న్స్ జ‌రిగాయి.ఈ వారం ఎలిమినేషన్‌కి జరిగిన నామినేషన్ చాలా ఆసక్తికరంగా హాట్ హాట్‌గా సాగాయి. ఒక్కొక్క సభ్యుడు ఇద్దరిద్దరు కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలన్నారు బిగ్ బాస్. ఇందుకోసం తాము ఎలిమినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి ఫోటోలను తీసుకుని ఎదురుగా ఉన్న మంటలో వేసి అందుకు గల కారణాలను వివరించాలన్నారు. మొద‌ట రోల్ రైడా దీప్తి నల్లమోతు, గీతా మాధురిలను ఎలిమినేషన్‌‌కి నామినేట్ చేస్తూ అందుకు గల కారణాల్ని వివరించారు.

‘టిక్కెట్ టు ఫినాలేలో భాగంగా దీప్తి నల్లమోతు సేఫ్ గేమ్ ఆడారని అందుకే నామినేట్ చేశానన్నారు. ఇక గీతా మాధురిని కూడా ఇదే కారణంతో నామినేట్ చేస్తున్నా అన్నారు. అమిత్.. దీప్తి నల్లమోతు, గీతా మాధురిలను ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తూ.. రోల్ రైడా అభిప్రాయాన్నే తానూ చెప్పొకొచ్చారు. టిక్కెట్ టు ఫినాలేలో రిలాక్స్ అయిపోయారన్నారు. సామ్రాట్.. దీప్తి నల్లమోతు, అమిత్‌లను నామినేట్ చేస్తూ.. టిక్కెట్ టు ఫినాలేలో మీరు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదని.. మహిళ అనే నేను గేమ్ నుండి తప్పుకున్నాననడం కరెక్ట్ కాదనిపించింది. కౌశల్.. తనీష్‌ను నామినేట్ చేస్తూ.. మీరు దీప్తిని అమ్మా అమ్మా అంటూనే ఆమెతో ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదన్నారు. మీరు రిలేషన్‌కి విలువ ఇచ్చినట్టు నాకు అనిపించలేదన్నారు. మీ ఒపీనియన్ కూడా సరిగా ఉండటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నాన్నారు. ఇక గీతా మాధురిని నామినేట్ చేస్తూ.. ఫైనల్ వరకూ వచ్చినా రూల్స్ పాటించకుండా పడుకోవడం, ఇంకా చైల్డ్ మెంటాలిటీతోనే ఉంటూ తన గేమ్ తనను ఆడకుండా మిగతా వారి గేమ్‌ని కూడా చెడగొడుతుందన్నారు.

గీతా మాధురి.. అమిత్, రోల్ రైడాలను నామినేట్ చేస్తూ,తనను నామినేట్ చేసినందకే మీ ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నానన్నారు. తనీష్.. దీప్తిని నామినేట్ చేస్తూ.. నేను కారులో నుండి మిమ్మల్ని తోయడం చూసేవాళ్లకు సరిగా అనిపించలేదని కౌశల్, నానిలు అన్నారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కాని మీరు నోరు విప్పి మాట్లాడలేదు. అది బాధ కల్పించింది. అందుకే మిమ్మిల్ని నామినేట్ చేస్తున్నా అన్నారు. త‌నీష్ మరో కంటెస్టెంట్‌గా అమిత్‌ను నామినేట్ చేశారు. వాళ్లు ఎఫెర్ట్ పెట్టలేదని మీరు నామినేట్ చేశారు అది మీకు కూడా వర్తిస్తుందన్నారు. అందుకే నామినేట్ చేస్తున్నానన్నారు. దీప్తి నల్లమోతు.. అమిత్‌ను నామినేట్ చేస్తూ నేను ఎఫర్ట్ పెట్టలేదని నామినేట్ చేశారని అదే రీజన్‌తో ఆయన్ని నామినేట్ చేస్తున్నానన్నారు. తరువాత రోల్ రైడాని నామినేట్ చేశారు. దీంతో ఈ వారం ఎలిమినేష‌న్‌కు త‌నీష్‌,సామ్రాట్‌లు త‌ప్ప మిగిలిన ఇంటి స‌భ్యులు అందరు నామినేట్ అయ్యారు.మ‌రి వీరిలో ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్‌ను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.ఇక చాలా వారాల త‌రువాత గీతా మాధురి ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -