Wednesday, May 15, 2024
- Advertisement -

కౌశ‌ల్‌లో మార్పును గ‌మ‌నించారా?

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఇప్ప‌టికే 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం ఓ వ్య‌క్తి చూట్టునే తిరుగుతుంది అని అంద‌రికి తెలిసిందే.అత‌నే ఎవ‌రో కాదు కౌశ‌ల్‌.బిగ్‌బాస్ మొద‌ట్లో కౌశ‌ల్‌ను చూసిన చాలామంది ఇత‌ను రెండు ,మూడు వారాలకు మించి షోలో ఉండ‌డని భావించారు.కాని ఎపిసోడ్‌లు గడిచే కొద్ది అత‌ను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు.అసలు షోలోనే స్ట్రాంగ్ కంటెస్ట్ అయిన తేజ‌స్వీ కూడా బ‌య‌టికి వెళ్లింది కాని కౌశ‌ల్ మాత్రం ఇంకా హౌస్‌లోనే కొన‌సాగుతున్నాడు అంటే అత‌ను ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నాడో అర్థం చేసుకోవాలి.

అత‌ను ఆడే గేమ్‌లో నిజాయితిని చూసి చాలామంది అత‌నికి అభిమానించ‌డం మొద‌లుపెట్టారు.కౌశ‌ల్‌కు బ‌య‌ట ఓ స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.సోష‌ల్ మీడియాలో కౌశ‌ల్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కౌశ‌ల్‌ పేరిట ఒక ఆర్మీని సృష్టించి, అత‌నితో గొడ‌వ‌ప‌డేవారిని బ‌య‌టికి పంపించేస్తున్నారు ఈ కౌశ‌ల్ ఆర్మీ.ఇప్ప‌టి వ‌ర‌కు హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిన వారంద‌రు కౌశ‌ల్‌తో గొడ‌వ‌ప‌డి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన‌వారే కావ‌డం విశేషం.ఇక కౌశ‌ల్ ఆడే గేమ్‌లో నిజాయితి ఉంద‌ని నాని కూడా అత‌నిన అభినందించాడు.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి గ‌త రెండు రోజులుగా అతని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.ప్ర‌తివారంబ‌య‌ట ప్రేక్ష‌కుల నుంచి హౌస్‌మెట్‌కు ఓ కాల్ వ‌స్తుంది.వారికి ఇష్ట‌మైన ఇంటి స‌భ్యుల‌తో వారు రెండు నిమిషాలు మాట్లాడ‌వచ్చు.శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కాల్ చేసిన అభిమాని కౌశ‌ల్‌తో మాట్లాతూ….అత‌నికి బ‌య‌ట ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో చేప్పేశాడు.ఇక మేము నీ కోసం కౌశ‌ల్ ఆర్మీ పేరిట గ్రూప్ క్రియేట్ చేశామ‌ని చెప్ప‌డంతో అక్క‌డే ఉన్న హౌస్‌మెట్స్‌తో పాటు షో యాంక‌ర్ నాని కూడా షాక్ గురైయ్యాడు.

బ‌య‌ట ఉన్న అతని ఫాలోయింగ్ గురించి తెలిసిప్ప‌టి దగ్గ‌ర నుంచి కౌశ‌ల్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని షో చూసే చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఎలిమ‌నేష‌న్‌లో భాగంగా కౌశ‌ల్ గ‌ణేష్‌తో ప్ర‌వ‌ర్తించిన తీరు దీనికి ఉదాహర‌ణ‌గా చెబుతున్నారు.హౌస్‌మెట్స్ అంద‌రు అత‌నిని క‌లుపుకోవ‌ల‌ని చూస్తున్న అత‌ను మాత్రం ఒంట‌రిగానే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నాడు.ఇక అత‌నికి చాలా స‌మ‌య‌ల‌లో మ‌ద్ద‌తు తెలిపిన గీతా మాధురితో కూడా కౌశ‌ల్ త‌రుచు గొడ‌వ ప‌డుతున్నాడు.ఇక ఈ రోజు జ‌రిగే ఎపిసోడ్‌లో కౌశ‌ల్ గీతా మాధురితో గొడ‌వ‌కు దిగాడ‌ని ప్రోమోని చూస్తే ఇట్లే అర్థం అవుతుంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చూసి కౌశ‌ల్‌ని ఇష్ట‌ప‌డ్డారో, ఇప్పడు కౌశ‌ల్ అది లేద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.మ‌రి దీనిపై కౌశ‌ల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -