Tuesday, May 7, 2024
- Advertisement -

కౌషల్ అభిమానులకు నిద్రలేని రాత్రి

- Advertisement -

బిగ్ బాస్ ప్రేక్షకులకు సోమవారం రాత్రి ఒక్కసారిగా షాక్ తగిలింది. ముఖ్యంగా కౌషల్ ఆర్మీకి, అతడి అభిమానులకు నిద్రలేని రాత్రే అయింది. ప్రతి సోమవారం నైట్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఆఖరులో, ఆ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యేవారి ప్లేర్లు బిగా బాస్ ప్రకటిస్తాడు. ఇక రాత్రి 11 గంటలకు బిగ్ బాస్ బులెటిన్ ముగిశాక, ఆ వెంటనే ఆ వారం ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సోమవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకూ ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహిస్తుంటారు. ఆ వారం నామినేట్ అయిన అభ్యర్ధుల ఫొటోలు, పేర్లుతో పాటు పక్కన వారికి వేయాల్సిన ఓట్లు ఉంటాయి. ఎవరికి నచ్చిన అభ్యర్ధికి వారు 50 ఓట్లు వేసుకోవచ్చు. లేదంటే 50 ఓట్లను అభ్యర్ధులకు నచ్చినట్టు, నచ్చినవారికి నచ్చినన్ని వేసుకోవచ్చు. వీటితో పాటు ఒక్కో ఫోన్ నంబర్ నుంచి 50 మిస్డ్ కాల్స్ ఇచ్చి కూడా ఓటింగ్ లో పాల్గొనవచ్చు.

అయితే కౌషల్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన అభిమానులు ఇప్పటికే కౌషల్ ఆర్మీ పేరుతో వందల వేల మెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్నారు. ఒక్కో అభిమాని దాదాపు యుద్ధం చేస్తున్న రీతిలో రోజుకు 1000, 2000, 3000 చొప్పున ఓట్లు వేస్తున్నారు. అయితే ఏ వారం కౌషల్ నామినేట్ అయితే ఆ వారం కోట్ల ఓట్లు ఆయనకే వేస్తున్నారు. గత వారం రికార్డు స్థాయిలో కౌషల్ అభిమానులు దాదాపు 16 కోట్ల ఓట్లు వేశారు. 20 కోట్ల టార్గెట్ పెట్టుకున్నా చివరికి 16 కోట్ల వరకూ వేశారని వివిధ ఆన్ లన్ వెబ్ సైట్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఆధారంగా తెలిసింది. కౌషల్ ను వ్యతిరేకించే వారిని ఎలిమినేట్ చేయడానికి కూడా మిగిలిన కంటెస్టెంట్లకు కూడా ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. నామినేట్ అయిన అభ్యర్థుల్లో కౌషల్ తో పెద్ద గొడవలు పెట్టుకుని, అతడికి ఇబ్బందికరంగా మారిన వారని ఎలిమినేట్ చేస్తూ వస్తోంది కౌషల్ ఆర్మీ. అయితే 12 వ వారం ఎలిమినేషన్లకు సంబంధించి సోమవారం రాత్రి 11 నుంచి ఆన్ లైన్ ఓటింగ్ లైన్స్ తెరుచుకోలేదు. దీంతో ఏదైనా కుట్ర జరుగుతోందా ? అని కౌషల్ ఆర్మీ ఆలోచనలో పడింది. అటు తమిళ ఓటింగ్ లైన్స్ కూడా తెరుచుకోలేదు. దీంతో రాత్రి మూడు గంటల వరకూ ఆన్ లైన్ ఓటింగ్ కోసం కౌషల్ ఫ్యాన్స్ ప్రయత్నాలు చేశారు. చివరకు తెల్లవారుజామున ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఓట్లతో దండయాత్ర ప్రారంభించారు. ఓటింగ్ ప్రారంభం అయి ఒక పూట కూడా గడవకముందే కౌషల్ 65 శాతం ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. 11 శాతంతో సామ్రాట్, 10 శాతంతో నూతన్ నాయుడు, 6 శాతం ఓట్లతో అమిత్, 5 శాతం ఓట్లలోపే గణేశ్ ఓట్లు సాధించుకున్నారు. ఇదే రీతిలో కొనసాగితే గణేశ్ ఎలిమినేషన్ తప్పదు. కౌషల్ తో పాటు ఎటూ కౌషళ్ ఆర్మీ నూతన్ నాయుడుని సేవ్ చేస్తుంది. కనుక సింగిల్ ఎలిమినేషన్ అయితే గణేశ్, డబులు ఎలిమినేషన్ అయితే గణేశ్ తో పాటు అమిత్, లేదా సామ్రాట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్సు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -