Thursday, May 9, 2024
- Advertisement -

బిగ్‌బాస్ ఫైన‌ల్‌లో సంద‌డి చేయ‌నున్న నాగ్‌?

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్  రెండో సీజ‌న్ మ‌రో కొద్ది రోజుల్లో ముగియ‌నుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.మొద‌టి బిగ్‌బాస్ సీజ‌న్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా చేయ‌గా ,రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.నాని త‌న‌దైన స్టైల్లో షోని ముందుకు న‌డిపిస్తున్నాడు.షో ఫైన‌ల్‌కు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఫైన‌ల్‌లో ఎవ‌రైన సెల‌బ్రిటీని తీసుకువ‌చ్చి గ్రాండ్‌గా ఎండ్ కార్డు వేయ‌ల‌ని బిగ్‌బాస్ యాజ‌మాన్యం భావిస్తుంది.

దీనిలో భాగంగానే టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జున‌ని బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు తీసుకువాడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తుంది.నాగ‌ర్జున‌ను ఫైన‌ల్‌కు తీసుకు వ‌చ్చే బాధ్య‌త‌ను నానికి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.ప్ర‌స్తుతం నాని-నాగుర్జున ఇద్ద‌రు క‌లిసి దేవ‌దాస్ అనే మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్నారు.దీంతో నాని అడ‌గితే,నాగ‌ర్జున రాకుండ ఉండ‌టా అని చాలా భావిస్తున్నారు.నాగ‌ర్జున క‌న‌క బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు వ‌స్తే షోకి మ‌రింత రేటింగ్ రావ‌డం ఖాయం. నాగ‌ర్జున కూడా గ‌తంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రొగ్రాంకు యాంక‌ర్‌గా ప‌ని చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -