Tuesday, April 30, 2024
- Advertisement -

శ్రీరంగ నీతులు కేసీఆర్‌కు స‌రే లోకేష్‌.. బాబుకు వ‌ర్తించ‌వా..?

- Advertisement -

రాజ‌కీయ ప‌రిజ్ణానంలో తండ్రిని మించి పోతున్నారు లోకేష్. ఫిరాయింపు రాజ‌కీయాల‌పై నీతులు మాట్లాడంలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నారు. తాజాగా ఫిరాయింపుల‌పై కేసీఆర్ మీద లోకేష్ చేసిన వ్యాఖ్య‌లపై ప్ర‌జ‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు న‌వ్వుకుంటున్నారు. నీతులు ఇత‌రుల‌కు స‌రే అవే నీతులు మాకు వ‌ర్తించ‌వా అంటే ఆ ఒక్క‌టి అడ్డ‌క్కు అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.

ఏపీలో ఫిరాయింపు రాజ‌కీయాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండగా తెలంగాణాలో ఫిరాయింపు రాజ‌కీయాల‌పై లోకేష్ వ్యాఖ్య‌లు న‌వ్వు తెప్పిస్తున్నాయి. వైకాపా తరఫున గెలిచినవారు ఇరవై మూడు మంది ఫిరాయించి అధికార పక్షంలో కూర్చున్నారని వారిపై చ‌ర్య‌లు తీసుకోండంటూ జ‌గ‌న్ మొత్తుకుంటుంటే దానిపై మాత్రం అధికార‌ప ప‌క్షంనుంచి స‌మాధానం మాత్రం రాదు.

ఇరవై మూడు మంది ఫిరాయించి అవతల కూర్చుంటే, వారిలో నలుగురు మంత్రి పదవులు తీసుకుంటే.. చర్యలు తీసుకోని దాన్ని అసెంబ్లీ అనాలా? అని వైకాపా ప్రశ్నిస్తోంది.తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను విమర్శిస్తూ ఫిరాయింపుల అంశం గురించి లోకేష్ ప్రస్తావించాడు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిని కేసీఆర్ చేర్చుకున్నారని.. వారు ఆంధ్రా ఓట్లతో నెగ్గిన వారని లోకేష్ బాబు ఘ‌న‌మైన మాట‌లే మాట్లాడుతున్నారు. ఆంధ్ర ఓట్లతో నెగ్గిన ఎమ్మెల్యేలను చంద్రశేఖరరావు తెరాసలో చేర్చుకున్నాడని.. లోకేష్ బాబు ఆందోళన వ్యక్తంచేశాడు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా…ఒకవైపు ఇరవై మూడు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొనసాగిస్తున్నది లోకేష్ బాబు తండ్రి, అయన పార్టీ అధినేత. ఇలాంటి సమయంలో కూడా తెలంగాణలో ఫిరాయింపులను లోకేష్ తప్పు పడుతున్నాడు. శ్రీరంగనీతులు చెబుతున్న లోకేష్ ఆయ‌న తండ్రి బాబుకు మాత్రం వ‌ర్తించ‌వు ఎందుకంటే అదంతే.

అవతల ఫిరాయింపుల వల్ల ప్రతిపక్షాన్నే అసెంబ్లీకి రానీకుండా చేసిన ఘనత వహించిన ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ.. ఎర్రగురివింద తన నలుపు ఎరగనట్టుగా తెలంగాణలో ఫిరాయింపులను లోకేష్ విమర్శిస్తున్నాడు. దీన్ని నిస్సిగ్గుతనం.. బరి తెగించడం అనాలా…? వారే తేల్చుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -