Monday, May 13, 2024
- Advertisement -

కౌశ‌ల్ ఇలాంటి వ్య‌క్తి అని మొద‌ట తెలియ‌లేదు – రోల్ రైడా

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌ చివ‌రి ఎలిమినేష‌న్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో షో నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశాడు రోల్ రైడా.అస‌లు రోల్ రైడా బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటాడ‌ని ఎవ‌రు ఊహించ‌లేదు.చాలా తెలివిగా గేమ్ ఆడిన రోల్ రైడా షో చివ‌రి ఎలిమినేష‌న్‌లో బ‌య‌టికి వ‌చ్చేశాడు.గ‌త వారం రోల్ చేసిన యాక్టింగ్ కూడా అత‌నిని కాపాడ‌లేక‌పోయింది.ఇక బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన రోల్ రైడా కౌశ‌ల్ గురించి సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.బ‌య‌ట కౌశ‌ల్ అన్న‌కు ఇంతటి ఫాలోయింగ్ ఉంద‌ని తెలియ‌దని చెప్పుకొచ్చాడు.అప్ప‌టికి శ్యామల అక్క కౌశ‌ల్ అన్న గురించి చెప్పింది కాని,నేను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని తెలిపాడు రోల్‌.

బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాతే త‌న‌కు కౌశ‌ల్ ఆర్మీ ప‌వ‌ర్ ఏంటో తెలిసింద‌ని వాఖ్య‌నించాడు రోల్‌.కౌశ‌ల్ అన్న చాలా మంచివాడ‌ని చెప్పుకొచ్చాడు రోల్‌.కౌశ‌ల్ అన్న నీతి,నిజాయితితో గేమ్ ఆడ‌తాడ‌ని ,ఏ ఎమోష‌న్‌ను బ‌య‌ట‌పెట్ట‌కుండా త‌న‌లోనే దాచుకోగ‌ల‌డు.అన్న ఎవ‌రితోను రిలేష‌న్‌షిప్ పెట్టుకోడ‌ని,అలాగే ఎవ‌రితోనే గొడ‌వ‌లు ప‌డే మ‌న‌స్థ‌త్వం కూడా కాద‌ని పెర్కొన్నాడు రోల్‌. కౌశ‌ల్ అన్న ద్వారా నేను కొన్ని నేర్చుకోగ‌లిగ‌న‌ని తెలిపాడు,బిగ్‌బాస్‌లో ఉన్నంత కాలం కౌశ‌ల్ అన్న మంచిత‌నం నేను చూడలేక‌పోయానంటూ చెప్పాడు రోల్ రైడా.బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు వెళ్లిన వారంద‌రికి ఆల్ ది బెస్ట్ తెలిపాడు రోల్‌.నా దృష్టిలో బిగ్‌బాస్ విన్న‌ర్ ముగ్గురు రేస్‌లో ఉన్నారు,కాని ఆ పేర్లు మాత్రం చెప్ప‌ను అని త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు రోల్ రైడా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -