Saturday, May 25, 2024
- Advertisement -

కేసీఆర్ కు పవన్ పూర్తిగా లొంగిపోయినట్టేనా !

- Advertisement -

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని అప్పుడెప్పుడో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలోనూ పోటీ చేస్తాం. కానీ ఎన్ని స్థానాల్లో పోటీ అన్నది ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన చెప్పారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చినా సరే ఇప్పటికీ పవన్ అక్కడ ఎన్ని స్థానాలపై పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ యువతలో మాస్ లో పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్ అంటే పడిచచ్చే అభిమానులు అక్కడ లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్లంతా ఈయన ఎటు చెబితే అటు మొగ్గు చూపుతారు. కానీ జనసేన నియోజకవర్గాలుగా నాయకులను నియమించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలు క్షేత్రస్థాయిలో ఏంటి ? పై స్థాయిలో కూడా అభ్యర్ధుల ఎంపిక, పోటీ, నియోజకవర్గాల వారీగా ఇంచార్జులు, బాధ్యతలు వంటి పార్టీ బలోపేత చర్యలు చేపట్టడంలో ఇంకా తడబడుతూనే ఉంది.

దీంతో ఎన్నికలు వచ్చేస్తున్నా, రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేస్తుందని తెలిసినా పవన్ సార్ లో ఎలాంటి కదలిక లేదు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుందాని చర్చలు జరుపుతున్నారు. కానీ వాళ్లు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ సహా మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాడాలని భావిస్తున్నారు. దీంతో పవన్ వారితో జట్టు కట్టలేపోతున్నారు. ఎందుకంటే పవన్ మొదటి నుంచీ కాంగ్రెస్ ద్వేషి. ఇటీవల టీడీపీతో విబేధాలు రావడం, బీజేపీ అడుగులకు జనసేన మడుగులొత్తడం చేస్తున్నారు. పైగా కేసీఆర్ బీజేపీ రహస్య ఒప్పందంతో ఎన్నికలకు వెళ్తున్నారు అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో పవన్ కేసీఆర్, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడు. పైగా ఆ మధ్య కేసీఆర్ పాలన భేష్ అంటూ పూలబొకేలు ఇచ్చి పొగడ్తల్లో ముంచెత్తారు. అంత భేషైన పాలన ఏం కనిపించిందో చెప్పాలంటూ విపక్షాలు నిలదీసినా పవన్ సమాధానం చెప్పలేకపోయారు.

ప్రస్తుతం తెలంగాణలో టీటీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేలా, బీజేపీ, టీఆర్ఎస్ కు మేలు జరిగేలా పవన్ పార్టీ పోటీ చేయబోతోందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్, టీడీపీ, టీజీఎస్, సీపీఐ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తద్వారా టీఆర్ఎస్ లాభ పడుతుందని వీళ్లంతా జట్టు కడుతున్నారు. అయితే పవన్ పార్టీ మాత్రం విడిగా పోటీ చేసి, కాంగ్రెస్, టీడీపీ ఓటు బ్యాంక్ ను చీల్చాలని ప్లాన్ చేస్తోందట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీల్చడం వల్ల కేసీఆర్ కు మేలు చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సెటిలర్లు, ఆంధ్రా ప్రాంత ప్రజలు, ఎక్కువగా నివసించే కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఉప్పల్, ఖైరతాబాద్, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మెద‌క్ జిల్లాల‌్లో సెలక్టడ్ గా 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏపీ వాసులే అధికంగా ఉండటం వల్ల, వాళ్ల ఓట్లు జనసేనకే పడతాయని, టీడీపీ, కాంగ్రెస్ నష్టపోతాయన్నది కేసీఆర్, బీజేపీ, జనసేన ఉమ్మడి రహస్య వ్యూహం. అయితే పవన్ మొదట్లో ఖబడ్దార్ కేసీఆర్…అంటూ మీసం మెలేశాడు కదా. మరి ఇప్పుడేమైంది ? అంటే ఏమో ఆయన లోగుట్టు ఏ పైన్ డ్రైవ్ రూపంలో రట్టవుతుందని భయపడుతున్నాడేమో..అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ మీద అభిమానంతోనో భయంతోనో మొత్తానికి పవన్ పూర్తిగా లొంగిపోయినట్టేననే వాదనలూ వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -