Saturday, May 4, 2024
- Advertisement -

కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ అయితే మ‌నంత ఇడియ‌ట్స్ ఎవ‌రు ఉండ‌రంటున్న క‌త్తి మ‌హేశ్‌

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బిస్ రెండో సీజ‌న్ తుది ద‌శ‌కు చేరుకుంది.ఈ వారంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.ఇక బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు ఐదుగురు కంటెస్టెంట్స్ చేరిన సంగ‌తి తెలిసిందే.అయితే బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు క‌త్తి మ‌హేశ్‌.కౌశ‌ల్‌పై క‌త్తి మ‌హేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.బిగ్‌బాస్‌లో రెండు వారాలుగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌తో కౌశ‌ల్ అంతా కోల్పోయాడు,అతడిని హౌస్ నుండి బయటకి గెంటేయండి అని పోస్ట్ పెట్టారు కత్తి మహేష్.

శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో నాని అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు త‌ల,తోక లేని సమాధానాలు చెప్తు కౌశ‌ల్ దొరికిపోయాడ‌ని చెప్పుకొచ్చాడు క‌త్తి.ఇక బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే కౌశ‌ల్ చికాకు తెప్పించే వ్య‌క్తి రికార్టుల‌కు ఎక్కాడ‌ని వాఖ్యానించాడు క‌త్తి.బిగ్‌బాస్‌లో చాల విసుగు తెప్పించే వ్య‌క్తి కౌశ‌ల్ అని ,ఒక‌వేళ కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ అయితే మ‌నంత ఇడియ‌ట్స్ ఎవ‌రు ఉండ‌ర‌ని సంచ‌ల‌న కామెట్స్ చేశాడు క‌త్తి మ‌హేశ్‌.బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు వెళ్లిన దీప్తి నల్లమోతు కోసం తాను కాంపెయిన్ నిర్వహిస్తానని తెలిపారు. మ‌రి క‌త్తి మ‌హేశ్ చేసిన కామెంట్స్‌పై కౌశ‌ల్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -