Tuesday, April 30, 2024
- Advertisement -

స‌డ‌న్‌గా టీవీ 9 దీప్తిని బ‌య‌టికి పంపించిన‌ బిగ్‌బాస్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ తుది అంకనికి చేరుకుంది.మ‌రో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తెలిపోనుంది.బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు ఐదుగురు స‌భ్యులు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.కౌశ‌ల్‌,దీప్తి, సామ్రాట్‌,గీతా మాధురి,త‌నీష్‌లు బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు చేరుర‌కున్నారు.ఎవ‌రికి వారు మేం బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.కాని వీరిలో ఇద్ద‌రికి మాత్ర‌మే బిగ్‌బాస్ విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.అయితే గ‌త రెండు రోజులుగా ఎటువంటి అంచ‌నాలు లేని దీప్తి న‌ల్ల‌మోతుకి ఓట్లు బాగా వ‌స్తున్నాయి అని ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో విపరీతంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.అయితే ప్రేక్ష‌కుల‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్.

ఈ వారం మిడిల్ వీక్ ఎలిమినేష‌న్ పెట్ట‌నున్నారని తెలుస్తుంది. దీనిలో భాగంగానే నాని ఈ రోజు కాని, రేపు కాని ఈ మిడిల్ వీక్ ఎలిమినేష‌న్ ద్వారా ఓ ఇంటి స‌భ్యుడిని బ‌య‌టికి పంపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ఎలిమినేష‌న్‌లో దీప్తి న‌ల్ల‌మోతు బ‌య‌టికి వ‌చ్చేస్తుంద‌ని,లేదు లేదు ఆల్ రెడీ బ‌య‌టికి వ‌చ్చేసింద‌ని స‌మాచారం.ఇంత స‌డ‌న్‌గా దీప్తిని ఎలిమినేట్ చేయాల్సిన అవ‌సరం ఏంటీ అనుకుంటున్నారా? టీవీ 9 యాంకర్‌గా పేరొందిన, దీప్తి నల్లమోతుకు బ‌య‌ట పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు.ఏదో ల‌క్ ఫేవ‌ర్‌తో బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు చేరుకున్న దీప్తికి భారీగా ఓట్లు రావ‌డం వెన‌కు భారీ కుట్ర జ‌రుగుతుంద‌ని గ‌త కొంత‌కాలంగా కౌశ‌ల్ ఆర్మీ ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీప్తి భ‌ర్త ఓ కంపెనీతో మాట్లుడుకుని దీప్తికి ఓట్లు వేయిస్తున్నార‌ని కౌశ‌ల్ ఆర్మీ చెబుతున్నారు.తాజాగా ఆధార‌ల‌తో స‌హా బిగ్‌బాస్ టీంకు దీప్తి ఫేక్ ఐడీల‌తో ఓట్లు వేయిస్తున్నార‌ని నిరుపించ‌డం జ‌రిగింద‌ట‌.

దీంతో ఈ మిడిల్ వీక్ ఎలిమినేష‌న్ ఏర్పాటు చేశార‌ట బిగ్‌బాస్ టీం.నాని కూడా దేవ‌దాస్ సినిమా షూటింగ్ అయిపోవ‌డంతో బిగ్‌బాస్‌పై ఫోక‌స్ పెట్టి, దీప్తి ఎలిమినేష‌న్ ఎపిసోడ్‌కు వ‌స్తున్నార‌ని తెలుస్తుంది.ఈ మిడిల్ వీక్ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింద‌ని స‌మాచారం.దీప్తి న‌ల్ల‌మోతుని బ‌య‌టికి పంపిచ‌కుండ అక్క‌డే ఉంచారట‌.ఇలా స‌డ‌న్‌గా దీప్తిని బ‌య‌టికి పంపిస్తే బిగ్‌బాస్‌కు ఇది మ‌చ్చలా ఉంటుంద‌ని భావించి దీప్తిని అక్క‌డే ఓ రూమ్‌లో ఉంచార‌ట‌.మ‌రి ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -