Thursday, May 23, 2024
- Advertisement -

పచ్చ పార్టీ అధినేత కుట్ర సిద్ధాంతాన్ని అతనికే చూపిస్తే తప్పా అంటున్న జగన్

- Advertisement -

తెలుగు నాట కుట్ర సిద్ధాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నాయకుడు. బహిరంగంగానూ, లోపాయికారిగానూ అన్ని పార్టీల అధినేతలు, నాయకులతోనూ ‘రాజకీయం’ చేస్తూ ఉంటాడు. ఏకంగా ప్రత్యర్థి నాయకుడిని చంపించే స్థాయిలో కూడా కుట్రలు చేస్తాడని అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. వైఎస్సార్ మరణం గురించి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నింటికీ మించి న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఉంచి కుట్ర సిద్ధాంతాలను రచించడంలో నిపుణుడు. విచారణా సంస్థలను కూడా మేనేజ్ చేయగలడు. 2014 ఎన్నికల ముందు వరకూ కూడా అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి రాజకీయాలు చేశాడు. అప్పుడు దేశాన్ని ఏలుతున్న అమ్మతో కలిసి ఎన్నో కుట్రలు రచించాడు. వైఎస్ జగన్‌పై ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలూ పన్నాడు. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగానూ హింసించాడు. అన్నింటినీ ఓపికగా భరించాడు జగన్.

ఇప్పుడు జగన్‌కి అలాంటి అవకాశమే వచ్చింది. తెలంగాణా ఎన్నికల పుణ్యమా అని ఆ కుట్ర నాయకుడికి కేసీఆర్‌తో కూడా బద్ధ శతృత్వం ఏర్పడడం ఖాయం అయింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలవడం ఖాయం అని, కేసీఆర్‌తో పెట్టుకోవద్దని ఆ కుట్ర నాయకుడి భజన పరుడైన తోక పత్రిక యజమాని ఓ స్థాయిలో భయాందోళన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ 2014 ఎన్నికలకు ముందు నుంచీ అంటకాగిన అమ్మ పార్టీతో పొత్తుకు సై అన్నాడు ఆ నాయకుడు. ఆ రకంగా కేసీఆర్‌కి శతృవు అయ్యాడు. ఇక మోడీతో ఎలాగూ శతృత్వం ఉంది. అందుకే ఇప్పుడు మోడీ, కేసీఆర్‌లు ఇద్దరూ కూడా జగన్ గెలుపును కోరుకుంటున్నారు. ఇవేవీ కూడా జగన్ ఆశించినవి, ప్లాన్ చేసినవి కాదు. పరిస్థితులు అలా కలిసి వచ్చాయి. 2014కు ముందు తనకు చూపించిన సినిమానే ఇప్పుడు ఆ కుట్ర నాయకుడు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అయితే ఆ నాయకుడు మాత్రం జగన్‌ని కూడా మోడీకి శతృవును చేయాలని తపన పడుతున్నాడు. రెచ్చగొడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని డిమాండ్ చేయడానికి, విమర్శించడానికి ఒకే కానీ తనకు కుటుంబపరంగా, రాజకీయాల పరంగా…….అన్ని విధాలుగా నష్టం చేసిన నాయకుడి కోసం నేను మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేయాలన్న విషయాన్ని మేధావుల ఎదుట కూడా ప్రశ్నిస్తున్నాడు జగన్. ఏది ఏమైనా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నట్టుగా కుట్ర సిద్ధాంతాలు రచించి జగన్‌ని అన్ని విధాలుగా ఇబ్బందిపెట్టిన జనాలందరూ ఇప్పుడు అవే ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెన్నుపోటు టైం నుంచి తిరుగే లేకుండా ‘రాజకీయం’ చేస్తున్న ఆ నాయకుడు ఈ సారి మాత్రం తప్పించుకునే అవకాశమే లేదని తాజాగా ఢిల్లీలో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -