Thursday, May 9, 2024
- Advertisement -

వీధి రౌడీ కన్నా దారుణమైన డైలాగులు

- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుద్దేశించి జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ చాలా ఘాటు హెచ్చరికలు చేశారు. రౌడీయిజం గూండాయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే కాళ్లు విరగ్గొడతాం. నేను ఒక్క సైగ చేస్తే చాలు, జనసేన సైనికులు కాళ్లు, కీళఅలు విరగ్గొట్టి కూర్చోబెడతారు జాగ్రత్త, ఖబడ్దార్ ! నేను16 ఏళ్ల వయస్సులోనే ఆకు రౌడీలను, గాలి రౌడీలను తన్ని తరిమేశాను, కానీ చంద్రబాబు, లోకేశ్ కు చింతమనేని ప్రభాకర్ అంటే భయం. 27 కేసులున్న వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎలా పెడతారంటూ పవన్ నిప్పులు చెరిగాడు. జనసైనికులపై దాడి చేస్తే .. ప్రతి చర్య తప్పదని వార్నింగ్ ఇచ్చారు.ఆడపడుచులపై చెయ్యిేస్తే.. తల తీస్తామని చెప్పండి. జనసైనికులపై దాడి చేస్తే .. ప్రతి చర్య ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అతడిపై మీరు చర్యలు తీసుకుంటారా ? లేక మమ్మల్ని తీసుకోమంటారా ? మీరే నిర్ణయించుకోండి అంటూ డీజీపీని ఉద్దేశించి అన్నారు. తాను పిడికిళ్లలో కోపాన్ని బిగించుకుని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, జేబుల్లో కోట్లు వేసుకుని రాలేదని సినిమా డైలాగురు చెప్పారు. జిల్లాలో శాంతిని నెలకొల్పడానికి కత్తి అండ కావాల్సిందేనన్నారు. ఆ కత్తిపట్టిన సైనికుణ్ణి నేనవుతా’ అంటూ పవన్‌ చాలా తీవ్రమైన భాష వాడారు. క్రిమినల్స్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఉపేక్షించాలా అంటూ ఆగ్రహం వ్యక్యం చేశారు పపవ్. శాసనసభా వేదికలపై పిచ్చికుక్కలు ఎక్కుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని తీవ్ర పదజాలం వాడారు.

అయితే పవన్ వాడిన డైలాగులు విన్నాక ఇతడు రాజకీయం చేయడానికి వచ్చాడా ? రౌడీయిజం చేయడానికి వచ్చాడా ? అని చాలామంది అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లు చట్టంపై నాకు గౌరవముంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అని చెప్పిన పవన్ ఇప్పుడు ఇలా ఓ వీధిరౌడీ స్థాయిలో మాట్లాడటం ఏంటని విస్తుపోతున్నారు.. అగ్నిగుండం సృష్టిస్తా, తల తీస్తాం. కాళ్లు, కీళ్లు విరగ్గొడతాం.ప్రతిచర్య ఉంటుంది. మీరు చర్యలు తీసుకుంటారా ? మమ్మల్ని తీసుకోమంటారా ? కోపం బిగపట్టి వచ్చా.. కత్తి పట్టిన సైనికుణ్ణి అవుతా…అంటూ పవన్ వాడిన తీవ్రమైన పదజాలంపై అన్నివర్గాల నుంచి అంతే తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఓ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కావాలని అనుకుంటున్న వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడితే, ప్రజలకు, ఆయన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఓ పార్టీ నాయకుడు, కొన్ని వేల మందిని ప్రభావితం చేయగల నటుడు, అయి వుండి పవన్ అంత ఘాటు హెచ్చరికలు చేస్తే, వాటి ప్రభావంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు విరుచుకుపడితే, విధ్వంసం సృష్టిస్తే ఎవరు బాధ్యులు ? చింతమనేని కానీ ఎవరైనా కానీ, చట్టాలను ఉల్లంఘిస్తే, మానవహక్కులను కాలరాస్తే, మహిళలను, వికలాంగులను హింసిస్తే…వారిపై కేసులు పెట్టాలి. న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ఇంకో రకంగా పోరాటం చేయాలి. అంతేకానీ తల తీస్తాం, అగ్ని గుండం చేస్తాం, కాళ్లు విరగ్గొడతాం, కత్తి పట్టుకుంటాం… అంటూ ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇలాంటి సినిమా డైలాగులు చెబితే, ఇతడు అధికారంలోకి వస్తే ఇంకేమైనా ఉందా ? అనే భయం జనంలో కలుగుతోంది. హింసకు హింసే సమాధానం కాదని సినిమాల్లో చెబుతూ, నిజ జీవితంలో ఏమాత్రం బాధ్యత లేకుండా ఇలా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో పవనే చెప్పాలి. ఇతడి వార్నింగులు విన్న జనం నీది రాజకీయమా ? రౌడీయిజమా ? అని ప్రశ్నిస్తున్నారు. చింతమనేనిది రౌడీయిజం అని చెబుతూ నువ్వు కూడా రౌడీలాగే మాట్లాడావు కదా….!. నువ్వు చేసిన హెచ్చరికలు ఎంత భయంకరమైనవో…? అర్ధమవుతోందా ? అని నిలదీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -