Tuesday, April 30, 2024
- Advertisement -

‘ఢీ 11’ యాంక‌ర్‌గా ‘బిగ్‌బాస్’ భాను శ్రీ?

- Advertisement -

తెలుగు టీవీ చ‌రిత్ర‌లో ఎన్ని డ్యాన్స్ ప్రొగ్రామ్స్ వ‌చ్చిన ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ‘ఢీ’ డ్యాన్స్ ప్రొగ్రామ్‌ను కొట్టింది ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోక‌టి రాలేదు అంటే అతిశేయోక్తి కాదు.గ‌త 10 సీజ‌న్‌లుగా ఈ ‘ఢీ’ ప్రొగ్రామ్ న‌డుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి,ఈ షో ఎంత‌టి హిట్ అయిందో.తాజాగా ముగిసిన ఢీ10 విన్న‌ర్‌గా రాజు అనే కంటెస్టెంట్ విన్న‌ర్‌గా నిలిచాడు.ఇక త‌రువాత సీజ‌న్ ఎప్పుడు మొద‌లు అవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చేస్తున్నారు.తాజాగా ఢీ 11 సీజ‌న్ ప్రారంభిస్తున్న‌ట్లు షో నిర్వ‌హ‌కులు ఓ ప్రోమోని విడుద‌ల చేశారు.’ఢీ 10’లో ఉన్న జ‌డ్జిస్ శేఖర్ మాస్ట‌ర్‌,ప్రియ‌మ‌ణిలు 11వ సీజ‌న్‌కు కూడా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. మూడో జ‌డ్జి ఎవ‌రో తెలియాల్సి ఉంది.

ఇక యాంక‌ర్‌గా ప్ర‌దీప్ అల‌రించ‌నున్నాడు.ఢీ లో ఒక డ్యాన్స్ టీంకు ఎప్ప‌టి లాగే సుధీర్ టీం లీడ‌ర్‌గా ఉంటున్నాడు.మ‌రో డ్యాన్స్ టీంకు ఈ సారి టీం లీడ‌ర్ మారుతున్న‌ట్లు అనిపిస్తుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా పాపుల‌ర్ అయిన భాను శ్రీ, ఢీ 11 సీజ‌న్‌లో అల‌రించ‌నుందని తెలుస్తుంది.ఒక డ్యాన్స్ టీంకు భాను శ్రీ టీం మెంటర్‌గా ఉండ‌నుంద‌ని ఈ ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఢీ 11లో భాను శ్రీ క‌నుక ఉంటే ఈ ప్రొగ్రామ్ మ‌రింత హిట్ అవ్వ‌డం ఖాయం.మ‌రి ఢీ లో ఎప్పుడు ఉండే యాంక‌ర్ రేష్మీ ఢీ 11లో ఉందో లేదో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -