Tuesday, May 21, 2024
- Advertisement -

విచారణకు వచ్చిన ముమైత్ ఖాన్ ఎవరితో వచ్చిందంటే..?

- Advertisement -

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులు.. విచారణకు వస్తున్నారు. ఈ నెపథ్యంలోనే ఈ రోజు టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ ఈ రోజు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఆమెతో పాటు వచ్చిన వారికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్ కార్యాలయానికి వాహనంలో వచ్చిన ముమైత్ ఖాన్ వెంట.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

విచారణకు హాజరయ్యే వారు తమ సన్నిహితులను వెంట తీసుకురావటం.. ఇంతకు ముందు విచారణ ఎదుర్కొన్న వారిని చూసినప్పుడు కనిపించింది. అయితే.. సిట్ కార్యాలయానికి ముమైత్ వెంట బిగ్ బాస్ ప్రతినిధులు కూడా వచ్చారన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రిస్టేజస్ ప్రాజెక్టు కావటం.. ఇందులో నటించే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే బిగ్ బాస్ నిర్వాహకులు.. ముమైత్ విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ముమైత్ వెంట విచారణ కోసం వచ్చిన వారు ఎందుకు వచ్చారు అనే విషయం క్లారిటీ లేదనే చెప్పాలి.

మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. విచారణకు బిగ్ బాస్ షో నుంచి వచ్చిన ముమైత్ ఖాన్ దగ్గర ఫోన్ కూడా లేదని.. ఆమె ఫోన్ బిగ్ బాస్ ప్రతినిధుల వద్దే ఉన్నట్లు అంటున్నారు. మరి ఇందులో అసలు నిజాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది. విచారణ పూర్తి అయి.. బిగ్ బాస్ హౌస్ కి ముమైత్ తిరిగి వెళ్లే వరకూ.. ఆమెతో బిగ్ బాస్ ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -