Friday, May 17, 2024
- Advertisement -

పార్టీని వీడేందుకు మ‌రో నేత సిద్ధం…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఏముహూర్తాన పార్టీ ఫిరాయింపుల‌ను మొద‌లు పెట్టాడో అప్ప‌టినుంచె ప‌త‌నం ప్రారంభం అయ్యింది. పాలు పోసి పెంచి ప్రోత్స‌హించిన పిరాయింపు పామె బాబును కాటేస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోను విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. దీంతో పార్టీని వీడెందుకు సిద్ద‌మ‌వుతున్నారు.
వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ను చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంతో అద్దంకి టీడీపీలో మంట రగులుతూనే ఉంది. గొట్టిపాటి వర్గానికి,క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గాల మ‌ధ్య బాబు రాజీ చేసె ప్ర‌య‌త్నాలు బెడిసికొడుత‌న్నాయి. బలరాం వర్గానికి చెందిన ఇద్దరిని దారికాచి ఇటీవల గొట్టిపాటి వర్గం హత్యలు చేసినా చర్యలు లేవు. పైగా కరణం బలరాం వర్గానికి ఎలాంటి పథకాలు అందడం లేదు.
ఈ నేపథ్యంలో బుధవారం కనిగిరిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ అంతర్గత సమావేశంలో కరణం బలరాం ఫైర్ అయ్యారు. పార్టీ వీడేందుకు కూడా సిద్ధమని మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావుతో బలరాం స్పష్టం చేశారు.పార్టీకోసం ప‌నిచేస్తున్నా వారిని అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో మేం పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తామైతే దేనికైనా రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లా మొత్తం మీద పార్టీ పాత కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుత జనరేషన్‌తో పబ్బం గడుపుకుని వెళ్లిపోయే కుహనా నాయకులు తయారయ్యారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమ దారి తామూ చూసుకుంటాం అని స్పష్టం చేశారు.
అయితే ఆగస్ట్ ఒకటిన ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని అంతవరకు తొందరపడవద్దని మంత్రులు పరిటాల సునీత, శిద్ధా రాఘవరావులు కరణం బలరాంకు సూచించారు. మొత్తం మీద అద్దంకి రాజకీయాలు ముదరిపాకనపడినట్టు భావిస్తున్నారు. మ‌రి బాబు ఎలా ప‌రిస్క‌రిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -