Friday, May 3, 2024
- Advertisement -

బాలయ్యతో బిగ్ బాస్ బ్యూటీ!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా ప్రీ బుకింగ్స్‌లోనూ సత్తాచాటారు బాలయ్య. ఇక ప్రీమియర్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబడుతోంది భగవంత్ కేసరి. మాస్‌కు తోడు ఎమోషన్‌ కలగలిపి అనిల్ రావిపూడి తెరకెక్కిని ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీలల కీలకపాత్ర పోషించారు. ఇక ఈ మూవీలో అనేకమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు భాగస్వాములు కాగా ఇటీవల బిగ్ బాస్ నుండి పాల్గొన రతిక సైతం ఓ పాత్ర పోషించింది. రాష్ట్ర మంత్రి పాత్ర చేయగా ఇంగ్లీష్ మాట్లాడే మంత్రిగా ఆకట్టుకుంది. ఇక ఇవాళ సినిమా విడుదలైన నేపథ్యంలో బాలయ్యను కలిశారు రతిక. పుష్పగుచ్చం అందించి విషెస్ తెలియజేసింది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో తన అందాలతో, ఆటతీరుతో మెప్పించింది. ముఖ్యంగా హౌస్‌లో ఆమె నడిపిన లవ్‌ ట్రాక్ హైలైట్. ఇక ఐదోవారం ఆమె బిగ్ బాస్ నుండి బయటకు రాగా రతిక స్క్రీన్ పై కనబడగానే ప్రేక్షకులు విజిల్స్‌తో సందడి చేశారు. గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్ వంటి చిత్రాల్లోనూ నటించింది రతిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -