Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీ ప్లాన్ ‘సీ’..బాబు లేకుండానే ఎన్నికల బరిలోకి!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన్ని జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు అలాగే పార్టీని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు నారా లోకేష్. ఇక చంద్రబాబు రిమాండ్ నాలుగోసారి పొడగించగా నవంబర్ 1 వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్‌పై రేపు సుప్రీం ఫైనల్ తీర్పు వెలువరించనుండగా బెయిల్ వస్తే ఒకే లేదంటే మరిన్ని రోజులు చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో ప్లాన్ ఏలో భాగంగా చంద్రబాబు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ప్లాన్ బీలో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి పాదయాత్రకు బదులు బస్ యాత్ర నిర్వహించనుండగా లోకేష్‌తో పాటు భువనేశ్వరి పాల్గొననున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.ఇక ఇదే సమయంలో చంద్రబాబు లేకుండానే ఈ సారి ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయనున్నారు లోకేష్.

ఇక జైలులో చంద్రబాబు ఆరోగ్యం సాకుతో బెయిల్ పొందే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ కావడం లేదు. చంద్రబాబు వయస్సు 73. జైల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుండి భోజనం వస్తున్న మెంటల్‌గా సైకలాజికల్‌గా వయస్సు దృష్ట్యా ప్రభావం తప్పదు. ఒకవేళ బాబు బయటకు వచ్చినా ఆయన సెట్ కావడానికి టైం పడుతుంది. ఈ లోపే ఎన్నికలు వస్తే ఆయన మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులను చంద్రబాబు లేకుండానే ఎన్నికలకు వెళ్లేలా సమయాత్తం చేయాలని నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు భార్య భువనేశ్వరిని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా చంద్రబాబు లేకుండా ఎన్నికలకు వెళ్లడం అంటే టీడీపీ నేతలకు కత్తిమీద సాములాంటిదే. మరి ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -