Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ 2: బాబాయ్ ఈ సారి ఇంకొంచెం మసాలా…

- Advertisement -

పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. గతేడాది తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన సంగతి తెలిసిందే. మరి త్వరలో ప్రసారం కానున్న సీజన్‌ 2లో ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారనే విషయంపై గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఉత్కంఠ‌కు స్టార్ మా తెర‌దించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్‌2 హోస్ట్ చేస్తున్నట్టుగా ఫస్ట్‌లుక్‌తో పాటు.. నానిపై ప్రత్యేకించి రూపొందించిన రెండున్నర నిమిషాల ప్రమోషన్ వీడియోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. బాబాయ్‌.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్‌బాస్‌తెలుగు2’ అని నాని ట్వీట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. నాని ట్వీట్‌పై స్టార్‌ మా స్పందిస్తూ.. ‘స్టార్‌ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్‌ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది.

( ఇక ప్రమోషన్ వీడియోలో ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలిరా.. పేరు చెప్పు అని అనగానే.. నాని అన్నా అంటూ చిన్న పిల్లాడు అరుస్తూ వెళ్లడం.. నాని వీరలెవల్లో ఎంట్రీ ఇచ్చి బాబాయ్.. ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ టీ తాగుతూ అదుర్స్ అనిపించారు. చిటికె వేసి మరీ.. ఏదైనా జరగొచ్చని హోస్ట్ చైర్‌లో కూర్చొని బిగ్ బాస్ రియాలిటీ షో సెట్‌లో కూల్‌గా చాయ్ తాగుతున్నాడు నాని)

తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్‌చేస్తున్నారు నిర్వాహకులు. ఫస్ట్‌ సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసి సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే. తొలి సీజన్‌ 70 రోజులు నిర్వహించగా, బిగ్‌బాస్‌-2 100 రోజులపాటు జరగనుంది. జూన్‌ 10 నుంచి రెండో సీజన్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -