Thursday, May 2, 2024
- Advertisement -

బ‌ల‌ప‌రీక్ష‌లో భాజాపా ఎలా నెగ్గుతుందంటే…?

- Advertisement -

కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. యడ్యూరప్ప సర్కారు రేపు ఎట్టి పరిస్థితుల్లో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ఏం జరగనుందోన‌ని దేశం మొత్తం క‌ర్న‌ట‌క‌వైపూ చూస్తోంది. ఇంకా చెప్పాలంటే ట్విష్ట్‌ల మీద ట్విష్ట్‌లు… నిమిషానికో ఉత్కంఠ ఊహాగానాలు…మ‌రో వైపు ఎమ్మెల్యేల బేర‌సారాలు ఇది క‌న్న‌డ ఎన్నిక‌ల రాజ‌కీయం.

అల‌స‌లు విష‌యానికి వ‌స్తే జాతీయ ఛాన‌ల్ ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డంతో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రేపు జ‌రిగే బ‌ల‌ప‌రీక్ష‌లో యెడ్డీ క‌శ్చితంగా గెలుస్తార‌నే క‌థ‌నం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. జేడీయూ-కాంగ్రెస్‌ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది.

కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్‌ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి భాజాపా వారిని బెంగళూరుకు తరలించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -