Saturday, May 4, 2024
- Advertisement -

రవితేజ సినిమా నేల టికెట్ సెన్సార్ టాక్…. ఆ ఒక్కటే కాపాడాలట

- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించాడు రవితేజ. కానీ ఆ వెంటనే వచ్చిన టచ్ చేసి చూడు దెబ్బకు దిమ్మతిరిగింది. అయితే ఇప్పుడు ‘నేల టిక్కెట్’ అంటూ తనకు స్టార్ ఢంని కట్టబెట్టిన మాస్ ప్రేక్షకులే టార్గెట్‌గా బరిలో దిగుతున్నాడు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఓ కొత్త కథ, కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదు. అయితే రవితేజ మార్క్ సీన్స్ మాత్రం కనిపిస్తున్నాయి.

తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నేల టికెట్‌కి యూ బై ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఒక్కటే మాట చెప్తున్నారు. నేల టిక్కెట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపించాలంటే రవితేజ ప్రేక్షకులకు నచ్చాలన్నదే ఆ డైలాగ్. కిక్-2 సినిమా తర్వాత నుంచీ గ్రేస్ కోల్పోయాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా లుక్ పరంగా చాలా విమర్శలే వచ్చాయి. బ్లైండ్‌ పర్సన్‌గా నటించిన రాజా ది గ్రేట్ మాత్రం ఒకే అనిపించాడు. అయితే టచ్ చేసి చూడులో మళ్ళీ రవి మార్క్ ఎనర్జీ కూడా మిస్ అయింది. ఇప్పుడు నేల టికెట్ సినిమాలో కూడా రొటీన్ కథనే అని తెలుస్తోంది. వృద్ధాశ్రమాలలో ఉండే వృద్ధుల సమస్యలు………ఆ వృద్ధులను హింసించే విలన్……..అలాగే ఆ వృద్ధులను పట్టించుకోని వాళ్ళ సంతానం చుట్టూ కథలో మెయిన్ ప్లాట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక రవితేజ మార్క్ కామెడీ సీన్స్, హీరోయిన్‌తో టీజింగ్ లవ్ స్టోరీ ఉందని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు. అన్నీ కూడా సోసో అన్నట్టుగానే ఉన్నాయట. అయితే రవితేజ లుక్ క్లిక్ అయితే మాత్రం గతంలో దుబాయ్ శీను లాంటి సినిమాల్లానే నేల టికెట్ కూడా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందని ………ఆ ఒక్కటీ తేడా వస్తే మాత్రం నేల టికెట్ సినిమా కేవలం నేల క్లాసు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అవుతుందని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు. మహానటి లాంటి న్యూ వేవ్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్న నేపథ్యంలో రవితేజ మార్క్ మాస్ మసాలా అయిన నేల టికెట్‌ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -