Saturday, May 4, 2024
- Advertisement -

పూజా రామచంద్రన్ ఎలిమినేషన్ పక్కా

- Advertisement -

వివిధ వెబ్ సైట్లు, ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ప్రకారం బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ లో ఈ వారం రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. అందుకు ప్రధాన కారణం కౌషల్ నామినేట్ కావడమే. 20 కోట్ల ఓట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన కౌషల్ ఆర్మీ దాదాపు అంత పనీ చేసింది. ఈ సారి ఏకంగా 18 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అందులో అత్యధిక శాతం కౌషల్ అభిమానులు వేసినవే. అందుకే కౌషల్ దాదాపు 55 శాతం ఓట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక మొదటి రెండు రోజులు తనీష్ రెండో స్థానంలో నిలిచినా, క్రమంగా దీప్తి నల్లమోతు రెండో స్థానాన్ని ఆక్రమించేసింది. దాదాపు 20 శాతం ఓట్లు సాధించుకుని ఆమె కూడా ఈ వారం సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. మూడో ప్లేస్ లో తనీష్ కొనసాగాడు. 15 శాతం వరకూ ఓట్లు తెచ్చుకున్న తనీష్ మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నాడని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. భుజానికి గాయం కావడంతో చికిత్స కోసం వెళ్లిన నూతన్ రీ ఎంట్రీ ఇంటి సభ్యులు కానీ, బిగ్ బాస్ ప్రేక్షకులు కానీ ఏ మాత్రం ఊహించనిదే. ఆయన రాకతో ఇంటి సభ్యుల సంఖ్య 11కు చేరింది. దీంతో ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇక నామినేట్ అయిన పూజా రామచంద్రన్ నాలుగో ప్లేస్ లో నిలిచింది. మొదట్నించీ ఈమెకు తక్కువగానే ఓట్లు పడుతూ వచ్చాయి. ఓటింగ్ ఆఖరి రోజు శుక్రవారం సాయంత్రం నుంచీ కౌషల్ అభిమానులు కొందరు తమ వ్యూహం మార్చారు. ఎటూ కౌషల్ మంచి ఆధిక్యంతో తిరుగులేని విధంగా దూసుకుపోయాడు. ఈ ఒక్క పూట కౌషల్ కు25, పూజాకు 25 చొప్పున ఓట్లు వేద్దాం. అలా అయితే కౌషల్ తో పాటు పూజా కూడా సేవ్ అవుతుంది. దీంతో తనీష్ ఎలిమినేట్ అయిపోతాడు. అని భావించి ఆమెకు కౌషల్ ఆర్మీ ఓట్లు స్ప్లిట్ చేసింది. దీంతో ఐదు శాతం ఓట్లుతో ఉన్న పూజా మెల్లగా 10 శాతం ఓట్లు తెచ్చుకోగలిగింది. కానీ ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి. సో ఈ వారం పూజా రామచంద్రన్ ఎలిమినేషన్ తప్పదు. ఫైనల్ దగ్గర పడుతుండటం, నూతన్ రీ ఎంట్రీతో ఇంటి సభ్యులు 11మంది కావడం నేపథ్యంలో ఈ వారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఏదైనా జరగొచ్చు. అదే జరిగితే పూజాతో పాటు తనీష్ కూడా ఇంటి దారి పట్టాల్సిందే. మొత్తానికి పూజా నాలుగో ప్లేసులో ఉండటంతో తనీష్ ఈ వారానికి సేఫ్ అయినట్టే అని సంబరపడ్డ తనీష్ అభిమానులకు ఇప్పుడు నూతన్ రీ ఎంట్రీ కలవర పెడుతోంది. డబుల్ థమాకా ఉంటే పులిహోరా స్టార్ అవుట్ అవుతాడని కౌషల్ ఆర్మీ సంబర పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -