Monday, May 20, 2024
- Advertisement -

జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌.. సెప్టెంబ‌ర్ 2న‌ పార్టీలోకి ఆనం …

- Advertisement -

మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమమైంది. తనకు పార్టీలో తగిన గుర్తింపు రావడంలేదనే కారణంతో టీడీపీ ని వీడిన సంగతి తెలిసిందే. టీడీపీ ని వీడిన నాటి నుంచి వైసీపీలోకి ఎప్పుడు చేరతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా.. సెప్టెంబర్ 2న ఆయన పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది.

తాజాగా ఆనం ఈ రోజు వైసీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో స‌మ‌వావేశ మ‌య్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, వైసీపీలో చేరిక తదితర అంశాలపై మేకపాటితో ఆనం ముచ్చటించారు. మేకపాటితో భేటీకి ముందు ఆనం నెల్లూరు జిల్లా వైసీపీ చీఫ్ కాకాని గోవర్ధన్ రెడ్డితోనూ గురువారం సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 2న మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జగన్ సమక్షంలో ఆనం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రజా సంకల్పయాత్ర పూర్తయ్యాక నెల్లూరులో భారీ బహిరంగ సభను ఆనం వర్గీయులు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం వెంకటగిరి సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో చేరే తేదీ ఖరారు చేసుకున్న క్రమంలో ఆనం జిల్లాలోని వైసీపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. ఆ పార్టీ శాసన సభ్యులు, ఎంపీ, ఇతర ముఖ్య నాయకులను వ్యక్తిగతంగా కలిసి తనకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే 2వ తేదీ విశాఖపట్నంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నారు. జ‌గ‌న్‌నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఆనం కుషీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -