Sunday, May 5, 2024
- Advertisement -

సౌండ్ పొల్యూషన్ కేరాఫ్ అడ్రస్ గీతామాధురి

- Advertisement -

ఏమిటో గీతామాధురి అచ్చం తేజశ్విలాగే బిహేవ్ చేస్తోంది. ఒక్కోసారి అంతకుమించి నోరేసుకుని పడిపోతోంది. మొదటి మూడు వారాలు చక్కని మాటతీరు, ఆటతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో రోజుకోరకంగా మారిపోతోంది. నోరున్నది వాగడానికే అన్నట్టు అడ్డూఅదుపు లేకుండా ఏమాత్రం ఖాళీగా ఉండకుండా అరుపులు, కేకలు, గుసగుసలతో బిగ్ బాస్ ప్రేక్షకుల సహానానికి పరీక్ష పెడుతోంది. అయినదానికీ కానిదానికీ, తన సంబంధం ఉన్నా లేకున్నా ఇంటి సభ్యులు అందిరి విషయాల్లోనూ తగుదునమ్మా…అని దూరిపోతోంది. తనదైన వితండవాదం, అర్ధంపర్ధం లేని ఆర్గ్యుమెంట్స్ తో మెంటలెక్కించేస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణం నానియేనని చాలామంది మండిపడుతున్నారు. మొదటి మూడు వారాల తర్వాత వచ్చిన నానీ నువ్వు సూపర్. నువ్వు తోపు. యాపిల్ టాస్క్ విషయంలో నీ స్టాండ్ కు హాట్సాఫ్. నువ్వు అలా చూసింది చూసినట్లు చెప్పకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కౌషల్ డేంజర్ జోన్ లో పడిపోయేవాడు. అని గీతాను ఆకాశానికెత్తేశాడు. ఇక అప్పటి నుంచి మొదలైంది గీతామాధురిలో ఓవర్ కాన్ఫిడెన్స్. ఓహ్ ఇక్కడ అంతా నేనే కాబోలు. అని భావిస్తున్నట్టుంది. అచ్చం తేజశ్వి ఏఏ తప్పులు చేసి బిగ్ బాస్ ప్రేక్షకుల సహానానికి పరీక్ష పెట్టి, ఎలిమినేట్ అయిపోయిందో…అవే పొరపాట్లు ఇప్పుడు గీతామాధురి చేస్తోంది. కీచు గొంతేసుకుని పెద్దపెద్ద అరుపులతో సౌండ్ పొల్యూషన్ కేరాఫ్ అడ్రస్ లా మారిపోయింది.

ఇక చిట్టిపొట్టి డ్రస్సులతో ఫ్యామిలి ఆడియెన్స్ కు ఇబ్బందికరంగా మారింది గీతాఆంటీ. ఎలిమినేట్ అయిపోయాక తేజశ్వి కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది కూడా ఇలాంటి మాటలే. నేను చిన్న చిన్న నిక్కర్లు, షార్ట్స్ వేసుకుంటే బిగ్ బాస్ జూమ్ చేసి చూపించాడు. క్లోజప్ షాట్స్ తో పదే పదే వాటిని ఫోకస్ చేశారు. కానీ నాలాగే గీతామాధురి కూడా చిట్టిపొట్టి నిక్కర్లు, అరకొర దుస్తులు వేసుకుంటున్నా అలా చూపించలేదు. అని తేజశ్వి ఆరోపించింది. ఇప్పుడు ఆ ముచ్చటా తీరిపోయింది. తేజశ్వి ఎలా కనిపించిందో ఇప్పుడు అచ్చం అలాంటి డ్రెస్సింగ్ తోనే కుటుంబ ప్రేక్షకులకు గీతా రోత పుట్టిస్తోంది. ఇక ఆ మధ్య సామ్రాట్ తో చూపులు కలిపి, మాటలు, వయ్యారాలు అబ్బో దానిపై డామేజ్ జరిగిందని గ్రహించి, బలవంతంగా రాఖీ కట్టి, దానిపై ముసలమ్మలకే ముసలమ్మలాగా విశ్లేషణలు, వివరణలు…అబ్బో….ఏంటి బిగ్ బాస్ మాకీ నస ? అనే స్థాయిలో విసిగించేసింది ప్రేక్షకులను. శ్యామల కౌషల్ ఆర్మీ గురించి చెప్పేయడం, నీకు కౌషలే గట్టిపోటీ అని ఆమె చెవిలో ఊదేయడంతో ఇక కౌషల్ ను టార్గెట్ చేసింది గీతా. అయినదానికీ కానిదానికీ అతడిని కెలుకుతోంది. కౌషల్ ఆర్మీ ఉందిగా అతడిని సేవ్ చేయడానికి, వాడుకుందాం. అంటూ ఎగతాళి చేస్తూ, కౌషల్ ను ఈ సీజన్ అంతటికీ నామినేట్ చేసిందుకు వెర్రినవ్వులు నవ్వుతూ కౌషల్ ఆర్మీని రెచ్చగొట్టింది. పైగా డేంజర్ బాక్స్ టాస్క్ సందర్భంగా ఈమె చెప్పిన డైలాగులు వింటే ఆమె అభిమానులు కూడా ఆమెకు ఓటు వేయరు. నేను గాల్లో దీపం పెట్టి అభిమానులదే భారం అని చెప్పను. నేను చేయాల్సింది నేను చేస్తాను. అయినా అభిమానులు ఈ రోజు ఉంటారు. రేపు ఉండరు. ఇవ్వాళ ఉన్న అభిమానులు రేపు ఉండకపోవచ్చు. ఇవాళ అభిమానులు కాని వాళ్లు రేపు కావచ్చు…అందుకే నేను వారిని నమ్ముకోను. నా ప్రయత్నం నేను చేస్తాను..అంటూ సోది చెప్పింది.

పోనీ అలా అని చెప్పిన గీతా ఏ టాస్క్ లోనైనా శక్తివంచన లేకుండా ఆడిందా ? తన ప్రయత్నం తాను చేసిందా ? అంటే అదీ లేదు. డబ్బాలో రాళ్లేసినట్లు రోజంతా వాగడం తప్ప, ఏ ఒక్క టాస్కును సీరియస్ గా తీసుకుని ఆడింది లేదు. పైగా అభిమానుల గురించి ఆమె చేసిన కామెంట్స్ తో ఆమె ఫ్యాన్సుకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఇక కౌషల్ ఆర్మీని రెచ్చగొట్టేలా సవాల్ చేసింది. మొత్తానికి గీతామాధురి తన ఇమేజ్ ను తానే చేజేతులా నాశనం చేసుకుంది. బిగ్ బాస్ కు ముందు గీతామాధురి అంటే చాలామందికి అభిమానం, మంచి అభిప్రాయం ఉండేవి. కానీ బిగ్ బాస్ తర్వాత ఆమె మీద చాలామంది అభిప్రాయం మార్చుకున్నారు. కౌషల్ విషయంలో ఆమె మార్చుకున్నట్టే…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -