Monday, May 13, 2024
- Advertisement -

బిగ్‌బాస్ షోలో ఆదర్శ్.. అందరిపై దాడి.. ఏం జరిగింది..?

- Advertisement -

‘బిగ్ బాస్’ షో ఎవ్వరూ ఊహించని విధంగా జరుగుతోంది. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి షో రాకపోవడంతో.. మంచి రెస్పాన్స్ వస్తోంది. షోలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. షో ప్రారంభమైన మూడో రోజు జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్ బాస్ ఇంటి సభ్యుడైన ఆదర్శ్ తన ప్రవర్తనతో అందరినీ బెంభేలెత్తించాడు. తనను అదుపు చేయడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేశాడు. ఆదర్శ్ ప్రవర్తించిన తీరు చూస్తుంటే….అతడికి మత్తు పానీయాల్లాంటి అలవాట్లు ఉన్నాయేమో అనే అనుమానాలు ప్రేక్షకుల నుండి వ్యక్తం అయ్యాయి.

అలవాటు ఉన్నవాళ్లే…. అది తమకు దొరకని సమయంలో ఇలా ప్రవర్తిస్తుంటారని, చివరకు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విస్కీ లాంటి మత్తు పానీయాలు కూడా బిగ్ బాస్ ఇంట్లోలో అందుబాటులో లేక పోవడంతో ఆదర్శ్ వింతగా ప్రవర్తించాడని, అందుకే విస్కీ కావాలంటూ అరిచాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదర్శ్‌ను అదుపు చేయడానికి కమెడియన్ ధనరాజ్ ప్రయత్నించగా…. అతడిపై దాడి చేసి కొరికేశాడు. ఆదర్శ్ గట్టిగా కొరకడంతో ధనరాజ్‌కు రక్తస్రావం జరిగింది. కొంతసేపటికి తేరుకున్న ఆదర్శ్ తాను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలియక తనలో తానే ఏడ్చేశాడు. ధనరాజ్ కు సారీ చెప్పాడు. అనంతరం అతడిని ప్రిన్స్ వేరే రూమ్‍‌కు తీసుకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు.

కొంత సేపటి తర్వాత బయటకు వచ్చాక.. ఆదర్శ్…. వస్తువులను చిందరవందరగా పడేస్తూ హల్ చల్ చేశాడు. అతడి ప్రవర్తనతో ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరు షాక్ అయ్యారు. అయితే బిగ్ హౌస్ లో హింసకు పాల్పడితే అతడిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండటంతో…. అంతా కలిసి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. తనపై దాడి చేసినా ధన్ రాజ్ లైట్ తీసుకున్నాడు. దీన్నంతా కావాలని చేసిన ఫ్రాంక్‌లా క్రియేట్ చేశారు. చివర్లో మాత్రం కేవలం ఫన్ కోసం చేసినట్లు చూపించారు. మరి ఆదర్శ్ రెటింగ్ కోసం ఇలా చేసాడా..? లేక అతను నిజంగానే విస్కీ కోసం గొడవ చేసాడా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -