- Advertisement -

నానిని మించిపోయిన కౌషల్ క్రేజ్

- Advertisement -

బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ ఏ ముహుర్తాన ప్రారంభమయిందో కానీ, ఆ షో కేవలం కౌషల్ కోసమే పెట్టినట్టు మారిపోయింది. మొదటి రెండు, మూడు వారాల తర్వాత నుంచి మొత్తం ఆట తీరే అనూహ్య మలుపు తిరిగింది. తోటి కంటెస్టెంట్ల గ్రూపిజం, కక్ష సాధింపు, కబుర్లు, ముద్దూ ముచ్చట్లు, వెకిలి చేష్టలు, ప్యాంపరింగులు, కౌషల్ ను ఒక్కడిని చేసి నామినేట్ చేయడం, కౌషలే లక్ష్యంగా నోరు పారేసుకోవడం…అన్నీ కలిసి కౌషల్ కు కలిసొచ్చాయి. మరోవైపు ఎందరు కంటెస్టెంట్స్ ఎన్ని రకాలుగా తనపై దాడి చేసినా, మానసికంగా వేధించినా, టాస్కుల్లో కావాలనే ఓడిపోయేలా వ్యవహరించినా కౌషల్ ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదర్లేదు. ముక్కుసూటి తనం, నిర్మొహమాటం, ఆత్మస్తైర్యం, గుండెనిబ్బరం, గేమ్ గెలవాలనే బలమైన లక్ష్యం, ప్రతి టాస్కులోనూ ప్రాణం పెట్టి ఆడే తీరు, కుండబద్దలు కొట్టినట్టే చెప్పే మాట తీరు, విలక్షణమైన వ్యక్తిత్వం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిరీటి, భానుశ్రీ, తేజశ్వి, బాబు గోగినేని, దీప్తి సునైనా, నందిని, పూజారామచంద్రన్, గణేశ్ వీళ్లందరూ కౌషల్ ను వేధించిన వాళ్లే. తమ ఆట తాము ఆడుకోవడం చేతకాక కౌషల్ ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకుని కౌషల్ ఆర్మీకి టార్గెట్ అయినవాళ్లే. వీళ్ల వికృతక్రీడను భరించలేక ప్రేక్షకులు కసితో రగిలిపోయారు. కానీ ఓర్పు, సహనంతో కౌషల్ గేమ్ ఆడుతూ జనం మనసుల్ని గెల్చుకున్నాడు. కౌషల్ ఆర్మీ పేరుతో పెద్ద అభిమాన సైన్యమే ఆయన కోసం ఏర్పడింది. ప్రతివారం యుద్ధం చేస్తున్నట్లు ఓటింగ్ లో పాల్గొంటోంది. కౌషల్ ఎవరిని నామినేట్ చేస్తే వారిని ఎలిమినేట్ చేసేస్తోంది. అలా ఇంతవరకూ శ్యామలతో పాటు 9మందిని ఎలిమినేట్ చేసింది కౌషల్ ఆర్మీ. కౌషల్ నామినేట్ అయితే కోట్ల ఓట్లు వేస్తూ, ఆయనను సేవ్ చేస్తున్నారు. ఆయన పూర్తి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడని నిర్ధారించుకున్నాక, ఆ వారం కౌషల్ ను టార్గెట్ చేసినవారు నామినేట్ అయితే వారిపై దృష్టి పెడుతున్నారు. వారికి తక్కువ ఓట్లు పడేలా ఇతరులకు ఓట్లు వేస్తూ, కౌషల్ శతృవులను ఎలిమినేటే చేస్తోంది కౌషల్ ఆర్మీ.

ఇక అంతటితో ఆగలేదు కౌషల్ ఆర్మీ అభిమానం. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికగా వందల వేల గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. కౌషల్ ను వేధించినవారిపై నిరంతరం ట్రోల్స్ చేస్తున్నారు. అసాధారణ వ్యక్తిత్వం, మొక్కవోని దీక్ష, నిరంతర శ్రమ, గెలవాలనే తపన, ఎవరెన్ని రకాలుగా వేధించినా తలొగ్గని ఆత్మస్థైరంతో తమకు రోల్ మోడల్ గా నిలిచిన కౌషల్ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి , ఆయన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కౌషల్ గెలుపు తమ గెలుపుగా భావించి కోట్లమంది ఫ్యాన్స్ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో గత వారం 19.5 కోట్ల ఓట్లు పడ్డాయంటే అందుకు ఏకైక కారణం కౌషల్. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ మొత్తం కౌషల్ చుట్టే తిరుగుతోంది. కౌషల్ కీ చైన్లు. కౌషల్ టీ షర్టులు, కౌషల్ ఆర్కీ 2కే రన్…ఇలా కౌషల్, కౌషల్, కౌషల్ బిగ్ బాస్ అంటే కౌషల్, కౌషల్ అంటే బిగ్ బాస్ అనే స్థాయికి వెళ్లిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే అతడి కోసమే షో చూస్తున్నారు చాలామంది ప్రేక్షకులు.

త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో కౌషల్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని కోట్లమంది ఎదురు చూస్తున్నారు. వారితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కౌషల్ కోసం ఎదురు చూస్తున్నారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకోవడంతోనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఇప్పటికే నిలిచాడు. కానీ అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. త్వరలో లాంఛనప్రయంగా ఆ ప్రక్రియ పూర్తయిపోతే, ఇక కౌషల్ కి టాలీవుడ్ నుంచి ఆఫర్లే ఆఫర్లు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ సినిమాల్లో కౌషల్ కోసం మంచి పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కౌషల్ తోనే సినిమాలు తీయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నానీ కంటే కౌషల్ క్రేజ్ అనేకరెట్లు పెరిగిపోయింది. ఇక ఫినాలే తర్వాత కౌషల్ కెరీర్ ఊహకందని రీతిలో పరుగులు పెట్టడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -