Tuesday, May 14, 2024
- Advertisement -

వైఎస్ జగన్-ప్రశాంత్ కిషోర్….. అసలు రీజన్ ఏంటంటే?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న విషయం 2019 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకోవడమే. ఎన్నికల ప్రచారం విషయంలో వైకాపాకు పీకే అండగా ఉంటాడని ఆ మధ్య వైఎస్ జగన్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు సడన్‌గా వైకాపా తరపున నేను పనిచేయడం లేదని పీకే చెప్పుకొచ్చాడు. కానీ తన టీం మాత్రం పనిచేస్తుందని చెప్పాడు. వైఎస్ జగన్-ప్రశాంత్ కిషోర్ మధ్య ఏం జరిగింది? తెరవెనుక ఏ శక్తులు అయినా పనిచేశాయా? పీకే తప్పుకోవడం వెనకాల కారణాలు ఏంటి అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఒక ముఖ్యనేత జగన్‌తో ప్రశాంత్ కిషోర్‌కి కమ్యూనికేషన్ గ్యాప్‌కి సంబంధించిన ఒక విషయం చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ కిషోర్ అండ్ టీంకి వైఎస్ జగన్ అత్యంత ఎక్కువ గౌరవం ఇచ్చాడు. సొంత మనిషిలా చూసుకున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం వైకాపా విషయంలో కాస్త నిర్లక్ష్యం చూపించాడు. ఆ మధ్య చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైకాపాకు అనుకూలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్రశాంత్ కిషోర్ కొన్ని ఇష్యూస్ రూపొందించాడు. అయితే 2014 ఎన్నికల్లో మోడీ గెలవడానికి ఏ సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఉపయోగించాడో వైకాపా ప్రచారానికి కూడా అవే అకౌంట్స్ యూజ్ చేశారు. అన్నీ కూడా నార్త్ ఇండియా వ్యక్తుల పేర్లతో ఉన్న అకౌంట్సే కావడంతో సోషల్ మీడియాలో రివర్స్‌లో ట్రోల్ అయ్యాయి. దాంతో వైకాపా నాయకులందరూ కూడా ప్రశాంత్ కిషోర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇక మరోవైపు మోడీకి వ్యతిరేకంగా పనిచెయ్యొద్దని ప్రశాంత్ కిషోర్ పైన ప్రెషర్ తీసుకుని వచ్చారు. అలాగే కేంద్రంలో ప్రముఖ స్థానంలో ఉన్న బాబుకు సన్నిహితుడు అయిన ఒక బిజెపి నాయకుడు కూడా వైకాపా గెలుపు కోసం పనిచేసే విషయంలో ప్రశాంత్ కిషోర్‌ని వెనక్కి తగ్గేలా చేశాడట. ఈ విషయంలో ప్రముఖ పచ్చ మీడియా అధినేత, మీడియా మొఘల్ కూడా ఇన్వాల్వ్ అయ్యారట. జగన్‌తో కమ్యూనికేషన్ గ్యాప్‌తో పాటు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు రావడంతో 2019 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తప్పుకున్నాడని ఢిల్లీ స్థాయి జర్నలిస్ట్ ఒకరు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న విషయంలో వైకాపా శ్రేణులు, నాయకులు మాత్రం సంతోషాన్నే వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా పార్టీని బదనాం చేయడం మినహా పికె చేసింది ఏమీ లేదని వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభంజనాన్ని క్యాష్ చేసుకుంటూ ఇతర నాయకులు కూడా కష్టపడితే 2019 ఎన్నికల్లో కచ్చితంగా విజయం వైఎస్ జగన్‌దేనని వాళ్ళు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -