Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో నాని కుమ్మేశాడుగా..!

- Advertisement -

గ‌త వారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది తెలుగు బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌. మొద‌టి సీజ‌న్ స‌క్సెస్ కావ‌డంతో రెండో సీజ‌న్‌ను మ‌రింత ప్ర‌తీష్ట‌త్మ‌కంగా మొద‌లు పెట్టారు. అయితే మొద‌టి సీజ‌న్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ రెండో సీజ‌న్‌కు దూరం అయ్యాడు. త్రివిక్ర‌మ్‌తో సినిమా ఉండ‌టం వ‌ల్ల ఎన్టీఆర్ బిగ్‌బాస్‌-2 చేయ‌లేదు. మొద‌టి సీజ‌న్‌లో ఎన్టీఆర్ యాంక‌రింగ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. పైగా ఎన్టీఆర్ త‌న స‌హ‌జ న‌ట‌న‌తో షోని తార స్థాయికి తీసుకువెళ్లాడు. ఇక ఎన్టీఆర్ స్థానంలో బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని ని యాంక‌ర్‌గా తీసుకున్నారు.నాని ఎంపిక‌పై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

నాని యాక్టింగ్ సైడ్ ఓకే కాని యాంక‌రింగ్ సైడ్ క‌ష్ట‌మ‌ని కొంద‌రు భావించారు.దీనికి త‌గినట్లుగానే బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్‌లో నాని యాంక‌రింగ్‌లో తెలిపోయాడు. కాని నిన్న‌(శ‌నివారం)జ‌రిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నాని ఓ రెంజ్‌లో రెచ్చిపోయాడు. త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్‌తో షోని అసాంతం న‌డిపించాడు. షోలో పాల్గొన్న సెల‌బ్రిటీల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. త‌న స్టైల్‌లో షోని ముందుకు న‌డిపించాడు. బిగ్‌బాస్ మొద‌ట్లో నాని యాంక‌రింగ్‌పై విమ‌ర్శ‌లు చేసిన వారు ఇప్పుడు నాని యాంక‌రింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ రోజే బిగ్‌బాస్ మొద‌టి ఎలిమినేట‌ర్ ఎవ‌రో తెలిసిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -