Saturday, May 18, 2024
- Advertisement -

కౌశ‌ల్‌తో మ‌ళ్లీ గొడవప‌డ్డ గీతా మాధురి

- Advertisement -

బిగ్‌బాస్‌లో గ‌త కొన్ని రోజులుగా కౌశ‌ల్‌కు గీతా మాధురిల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తుంది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా వీరిద్ద‌రు గొడ‌వ ప‌డుతునే ఉన్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో విజ‌యం సాధించిన గీతా మాధురి త‌న‌కిచ్చిన స్పెష‌ల్ ప‌వ‌ర్స్ ద్వారా ఈ సీజ‌న్ మొత్తం ఎలిమినేట్‌కు నామినేట్ చేసింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య గొడవ మ‌రింత ముదిరింది. తాజాగా టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌లో కూడా వీరిద్ద‌రు గొడ‌వ ప‌డ్డారు. టాస్క్‌లో భాగంగా కారులో కుర్చున్న వారు 24 గంట‌ల పాటు కారులోంచి దిగ‌కూడ‌దు,నిద్ర కూడా పోకూడ‌దు. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు అయితే కారులో ఉంటారో వారు విజేతగా నిలుస్తాడని బిగ్‌బాస్ చెప్ప‌డం జ‌రిగింది. ఈ సీజ‌న్ మొత్తం ఎల‌మినేష‌న్‌లో ఉన్న కౌశ‌ల్ ఈ టాస్క్‌కి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాడు బిగ్‌బాస్‌. టిక్కెట్ టు ఫినాలే టాస్క్ సంచ‌ల‌కుడిగా బిగ్‌బాస్ కౌశ‌ల్‌ను నియ‌మించాడు బిగ్‌బాస్‌. ఇక్క‌డే మొద‌లైంది అస‌లు స‌మ‌స్య‌. కౌశ‌ల్‌ను సంచ‌ల‌కుడిగా నియ‌మించడం హౌస్‌మెట్స్‌కు న‌చ్చ లేదు. గీతా మాధురి ప‌డుకుంది అని కారులోంచి దింపేశాడు కౌశ‌ల్‌. కారులో నిద్రపోతున్న గీతా మాధురిని హెచ్చరిస్తూ.. హౌస్‌లొ కుక్కలు మొరగడంతో సంచాలకుడు కౌశల్, కౌశల్‌ల మధ్య వివాదం రేగింది.

మీరు పడుకున్నారు కారు దిగాలని కౌశల్ కోరడంతో నేను పడుకోలేదు, పాటలు పాడుతున్నా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది గీత. అయినా మీరు చెప్పితే నేను కారు దిగనని బిగ్ బాస్ చెబితే కారు దిగుతా అని, కారు ఎక్కేవరకే సంచాలకుడి పని లోపలి ఏం చేసినా మీకు అనవసరం అంటూ వాదనకు దిగింది గీతా మాధురి. అయితే కౌశల్ కూడా వెనక్కి తగ్గకుండా గీతా మాధురి కారు దిగాల్సిందే అంటూ పట్టు పట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో కారు దిగి ఫినాలే టిక్కెట్‌ను తొలిత కోల్పోయింది గీతా మాధురి. ఈ సీజన్ మొత్తం గీతా మాధురి వల్ల ఎలిమినేషన్‌‌లో ఉన్న కౌశల్.. మరోసారి ఇదే విషయాన్ని గీతా మాధురితో ప్రస్తావిస్తూ వాదనకు దిగారు. మీరు యాక్షన్‌ని బట్టే నా రియాక్షన్ ఉంటుందని దానివల్లే సీజన్ మొత్తం ఎలిమినేట్ చేశా.. మిమ్మల్ని కాకుండా వేరే వాళ్లని ఎలిమినేట్ చేసి ఉంటే చాలా బాధపడేదానినని.. మిమ్మల్మి ఎలిమినేట్ చేసినందుకు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందంటూ గీతా మాధురి కుండబద్దలు కొట్టేసింది. మీరు ఎప్పుడైతే నన్ను ఎలిమినేట్ చేశారో అప్పుడే మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందంటూ కౌశల్ కౌంటర్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -