Tuesday, April 30, 2024
- Advertisement -

టికెట్ ఇవ్వ‌కుంటే..? కేసీఆర్‌కు డెడ్ లైన్ పెట్టిన శ్రీకాంతాచారి త‌ల్లి

- Advertisement -

టికెట్ల లొల్లి టీఆర్ఎస్ పార్టీలో తారాస్థాయికి చేరింది. టికెట్ ద‌క్క‌ని వారు కేసీఆర్‌పై తిరుగుబాటు ఎగ‌రేశారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలగాణ అసెంబ్లీని రద్దు చేసి.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు కేసీఆర్. ఇప్పడు అదే ఆయనకు తలనొప్పిగా మారినట్టు కనపడుతోంది.

టికెట్ ద‌క్క‌ని వారు పార్టీ అధిష్టానాన్ని బెదిరించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే టికెట్ ఆశించి భగపడిన కొందరు నేతలు మీడియా ముందు తమ అసహాన్ని వెల్లగక్కగా.. తాజాగా మరొకరు ఈ జాబితాలో చేరారు. తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానానికి పాల్పడి… చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి దాసోజు శంకరమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనను కాదని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్ ను మరొకరికి ఇస్తే… 10 నిమిషాల్లోనే తన ప్రాణం పోతుందని హెచ్చరించారు.

తనకు టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హామీ ఇచ్చారని… ఇచ్చిన మాటను నిలుపుకుంటారని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాదులోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నిన్న హల్ చల్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -