Sunday, May 19, 2024
- Advertisement -

14 వ వారం ఎలిమినేట్ అయ్యేది వీరే

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లోకి కౌషల్ ఏ ముహుర్తాన ఎంటరయ్యాడో కానీ క్రేజ్ మామూలుగా లేదు. కోట్లమంది అభిమానులతో కౌషల్ ఆర్మీ ఏర్పడింది. వారంతా కౌషల్ ఆర్మీ 2కే రన్, కౌషల్ ఆర్మీ2కే వాక్, కౌషల్ కీ చైన్లు, కౌషల్ టీ షర్ట్స్, కౌషల్ పేరుతో అన్నదానాలు, పాలు పళ్లు దానాలు…అబ్బో ఒకటా రెండా ఇలా అనేక రకాలుగా తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ థీమ్ తో వినాయక మంటపాలు ఏర్పాటు చేశారు. కౌషల్ ఆర్మీ, ఆయన పోస్టర్లతో కొన్నిచోట్ల ఈ మంటపాలు వెలశాయి. వీటిని చూస్తుంటే మిగతా కంటెస్టెంట్స్ అభిమానులు ఓర్వలేక పోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 ఆల్ మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. ఇప్పటికే కోట్లమంది మనసులు గెల్చుకుని టైటిల్ విన్నర్ రేసులో దూసుకుపోతున్నాడు కౌషల్. ఇక వచ్చే వారంతో షో ముగియనుంది. ఆ ఫినాలేలో అధికారికంగా టైటిల్ విన్నర్ కౌషలే అని ప్రకటించడం మాత్రమే మిగిలింది. టాప్ ఫైవ్ లో బహుశా కౌషల్ తో పాటు గీతా మాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ ఉండే అవకాశాలున్నాయి. 14 వ వారం నామినేట్ అయిన వారిలో కౌషల్ ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేసులో దూసుకుపోతున్నాడు. రెండో స్థానంలో దీప్తి నల్లమోతు, మూడో ప్లేసులో గీతామాధురి, నాలుగో స్థానంలో రోల్ రైడా, అమిత్ తివారి ఉన్నారు. వీరిద్దరి ఓటింగ్ కేవలం 4 శాతం లోపే ఉంటోంది. ఇద్దరి మధ్య స్వల్ప ఆధిక్యత దోబూచులాడుతోంది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే రోల్ రైడా లేదా అమిత్ తివారి ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శుక్రవారం రాత్రికి బహుశా అమిత్ ఐదో స్థానంలో స్థిరపడిపోవచ్చు. ప్రైవట్ ఆల్బమ్స్ తో ర్యాప్ సింగర్ గా పాపులర్ అయిన రోల్ రైడా అభిమానులు ఒకవేళ ఓటింగ్ లో జోరు పెంచితే అతడు నాలుగో స్థానంకి ఎగబాకవచ్చు. మొత్తంగా పది శాతం లోపే ఓట్లు వచ్చినా, అమిత్ కంటే కాస్త ఆధిక్యంతో గట్టెక్కవచ్చు. కానీ వచ్చే వారం ఫినాలే కనుక, హౌస్ లో ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు కనుక, బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే అమిత్, రోల్ రైడా ఇద్దరూ ఔటే. మిగిలిన ఐదుగురు అంటే కౌషల్, దీప్తి,గీతా, తనీష్, సామ్రాట్ నేరుగా ఫినాలేకి వెళ్లిపోతారు. లేకుంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ తో ఒకర్నే పంపించేసే, లాస్ట్ వారం, అంటే 15వ వారం కూడా ఎలిమినేషన్ చేసే అవకాశాలనూ కొట్టి పారేయలేం. అంటే శనివారం ఒకర్ని ఎలిమినేట్ చేసి, ఆ మరుసటి రోజు ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వేళ బిగ్ అలా ప్లాన్ చేస్తే 14వ వారం ఎలిమినేషన్ నుంచి రోల్ రైడా బయటపడవచ్చు. అప్పుడు మళ్లీ 15వ వారం నామినేషన్లలో ఇంటి సభ్యులు ఆరుగురూ ఉండే చాన్స్ ఉంది. ఆ ఆరుగురిలో ఎవరో ఒకరు శనివారం ఎలిమినేట్ అయిపోయాక, మిగిలిన ఐదుగురు ఆదివారం నాటి ఫినాలేకి వెళ్లిపోతారు. కౌషల్ ఎటూ ఫినాలేకి కన్ఫమ్ కనుక మిగిలిన ఐదుగురిలో దీప్తి, గీతా, తనీష్, రోల్ రైడా, సామ్రాట్ లలో ఎవరు ఉంటారో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -