Wednesday, May 15, 2024
- Advertisement -

తేజశ్వి నోటి దురద ఎఫెక్ట్ కెరీర్ ఔట్

- Advertisement -

బాబోయ్ మాకు ఆ యాంకర్ వద్దు. మీకు అంతకంటే ఎవరూ దొరకలేదా ? చూస్తుంటే పిల్లలు జడుసుకుంటున్నారు సార్. ప్లీజ్ సార్ ఆ యాంకర్ ని మార్చేయండి సార్. మీకు దండం పెడతాం సార్. ఆ దయ్యం యాంకరింగ్ చూసి మా ఫ్రెండ్స్ కి జ్వరాలు వచ్చేశాయి. ఆసుపత్రికి వెళ్లాం. డాక్టర్ గారు భయపడే వాటిని చూడొద్దని హెచ్చరించారు. ఇప్పుడు ఎవరు సార్ సమాధానం చెబుతారు. కావాలంటే మీ వాట్సాప్ నంబర్ ఇవ్వండి మా ఫ్రెండ్స్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వివరాలు, మెడిసిన్ బిల్లులు పంపిస్తాం…అంటూ స్టార్ మా టీవీ చానెల్ కు వేల ఫోన్లు చేస్తున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. ఇంతకీ వీరి ఆవేదన ఏంటంటే ఆ చానెల్ నిర్వహిస్తున్న లాఫ్టర్ చాలెంజ్ ప్రోగ్రామ్ యాంకర్ గా తేజశ్వి వద్దే వద్దు. అనేది వీరి డిమాండ్. బిగ్ బాస్ సీజన్ 2లో కీచుగొంతుతో ప్యాంపరింగులతో, చిట్టిపొట్టి దుస్తుల్లో ఆమె చేసిన రచ్చ చూడలేక వాంతులు చేసుకున్నాం. ఇక టీవీలో కనపడదు అని ప్రశాంతంగా నవ్వుకుందామని లాఫ్టర్ చాలెంజ్ చూద్దామంటే అందులో ఆమెను చూసి భయపడిపోతున్నాం. ఇంక చాలు ఆపేయండి బాబూ..దయచేసి ఆమెను ఆ ప్రోగ్రామ్ నుంచి తీసేయండి..అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు స్టార్ మా టీవీ చానెల్ ఆఫీస్ కు తెగ ఫోన్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 2లో తేజశ్వి ప్రవర్తనతో విసిగివేసారిపోయిన ప్రేక్షకులు ఆమెను వేగంగానే ఎలిమినేట్ చేసేశారు. కౌషల్ గెలుపు తర్వాత కూడా ఆమె జీర్ణించుకోలేక కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ. నేను కంటెస్టెంట్స్ మనసు గెల్చుకున్నాను. నేనే విన్నర్ ని… అంటూ సోషల్ మీడియాలో మళ్లీ కౌశల్ తో పాటు, అతడి అభిమానులను అవమానించేలా ట్వీట్సు చేస్తోంది. దీంతో తేజశ్వికి ఏమైంది ? బాగానే ఉందా ? లేక మానసిక సమస్యలతో బాధ పడుతోందా ? కోట్లమంది ప్రేక్షకులు ఓట్లు వేసి టైటిల్ విన్నర్ గా కౌశల్ ను గెలిపించారు. ఆ షో అంతటితో ముగిసిపోయింది. ఇంకా ఆ గెలుపును జీర్ణించుకోలేక తేజశ్వి ఇలా పోస్టులు చేయడం, ట్వీట్లు పెట్టడం చూస్తుంటే చెప్పుకోలేని సమస్యలతో ఆమె బాధ పడుతున్నట్టుంది. ఆమె మనసు గెల్చుకున్న కంటెస్టెంట్లు ఎవరైనా యర్రగడ్డకు తీసుకెళ్లవచ్చు కదా..! అని బిగ్ బాస్ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా నువ్వు కౌశల్ మీద కౌశల్ ఆర్మీ మీదా ట్రోల్స్, ఎటకారాలు, ట్వీట్స్ ఆపకపోతే మేమే నిన్ను యర్రగడ్డలో జాయిన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంక అంతటితో ఆగకుండా బ్రహ్మానందం మెయిన్ యాంకర్ గా స్టార్ మా టీవీలో వస్తున్న లాఫ్టర్ చాలెంజ్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా తేజశ్విని పెట్టుకున్నందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనను ఎలిమినేట్ చేసేశారని బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు, ప్రేక్షకులను, స్టార్ మా టీవీని నానా శాపనార్ధాలు పెట్టి, తిట్టిపోసిన తేజశ్విని ఎలా యాంకర్ గా తీసుకుంటారు ? అంటూ నిలదీస్తూ కౌశల్ ఫ్యాన్సు, బిగ్ బాస్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. దీంతో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ తలలు పట్టుకుంటున్నారు. తేజశ్వి నోటి దురద ఎఫెక్ట్ మామూలుగా లేదుగా, ఆమె కెరీర్ ఇక ఔట్ అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ చానెల్ కు ఫోన్లు చేస్త్తూ తేజశ్విని తొలగించాలని డిమాండ్ చేస్తున్నవారిలో ఎక్కువమంది మహిళలే ఉండటం కొసమెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -